నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ కూడా ఎక్కువ శాతం మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ఈమె తాజాగా రానా సరసన నటించిన విరాటపర్వం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను కాస్త నిరాశపరిచింది. ఇకపోతే ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లను రాబట్ట లేకపోయినా ఇందులో సాయి పల్లవి నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
ఇకపోతే ఈమె నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ క్రమంలోనే ఓటీటీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రానా సాయి పల్లవి ఇద్దరు కలిసి నెట్ఫ్లిక్స్ ప్రసిద్ధ చాట్ షో మై విలేజ్ షోలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి ఎన్నో విషయాలను పంచుకోవడమే కాకుండా తన చిన్నప్పటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నారు.ఈ క్రమంలోనే తాను ఏడవ తరగతి చదివే సమయంలో జరిగిన సంఘటన గురించి సాయి పల్లవి ఈ సందర్భంగా బయటపెట్టారు.
ఈ క్రమంలోనే సాయి పల్లవి మాట్లాడుతూ తాను ఏడవ తరగతి చదివే సమయంలో తన స్కూల్ బ్యాగ్ లో ఒక అబ్బాయి ప్రేమ లేక పెట్టాడని తెలిపింది. ఈ విషయం తనకు తెలియక ఎప్పటిలాగే ఇంటికి వెళ్లానని అయితే లవ్ లెటర్ తన తల్లిదండ్రుల కంటపడటంతో తనని చితక్కొట్టారని సాయి పల్లవి వెల్లడించారు.
ఇలా ఏడవ తరగతిలోనే ప్రేమలేఖ వల్ల నా తల్లిదండ్రులతో బాగా దెబ్బలు తిన్నానని ఈ సందర్భంగా సాయి పల్లవి తన మొదటి ప్రేమలేఖ గురించి వెల్లడించారు. ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.