సాయి పల్లవి.. ఒక్క ఫిదా మూవీతో స్టార్ స్టేటస్ ఇమేజ్ ను స్వంతం చేసుకున్న నటి. నటనలోనూ, డ్యాన్స్ లోనూ అదరగొట్టేస్తున్న సాయి పల్లవికి అవకాశాలు వెతుక్కుంటూ మళ్లీ వస్తున్నాయి.. అయితే సెట్ లో ఆమె వ్యవహారశైలి హీరోలకు ఇబ్బందిగా మారిందనే వార్తలు వచ్చాయి..నానీతో “మిడిల్ క్లాస్ అబ్బాయి” మూవీలో నటించే సమయంలో కూడా సాయి పల్లవి చిత్ర యూనిట్ ను బాగానే ఇబ్బందికి గురి చేసిందట. ఒక దశలో ఆమెకు, నానికి మధ్య మాటలు కూడా లేకుండాపోయాయని కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత నాగశౌర్యతో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన “కణం” షూటింగ్ సమయంలోనూ నాగ శౌర్యకు చుక్కలు చూపిందట. షూటింగ్ కు ఎప్పుడు సరైన సమయానికి రాదని, వచ్చిన మోనిటర్ చూస్తూ కాలక్షేపం చేసేదని స్వయంగా నాగ శౌర్య ఒక ఇంటర్వ్యూ లో వెల్లడించాడు.
ఇప్పడు ఈ సెగ తమిళ స్టార్ హీరో సూర్యకు తగిలింది. ప్రస్తుతం తమిళంలో సూర్య జోడీగా ఒక సినిమా చేస్తోంది. తన అభిమాన హీరో సరసన ఇంత త్వరగా ఛాన్స్ తగులుతుందని తాను కలలో కూడా అనుకోలేదని ఆ మధ్య సాయిపల్లవి చెప్పింది. అలాంటి సాయిపల్లవి ఈ సినిమా షూటింగుకి ఆలస్యంగా వస్తూ, అందరినీ ఇబ్బంది పెట్టేస్తోందట. షూటింగ్ స్పాట్ లోను ఆమె వ్యవహార శైలి ఇబ్బందికరంగా ఉందనే టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఇలాగైతే సాయి పల్లవి కెరీర్ కు ఇబ్బందదులొస్తాయని అభిమానులు ఆందోళన వ్యక్తం చేసున్నారు.