Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

టాలీవుడ్లో ఉన్న టాప్ ప్రొడ్యూసర్స్ లో బన్నీ వాస్ ఒకరు. ‘గీతా ఆర్ట్స్’ చైల్డ్ బ్యానర్ అయినటువంటి ‘జి‌ఏ2 పిక్చర్స్ అధినేతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. అల్లు అర్జున్ కి మంచి స్నేహితుడు. అలాగే అతని సినిమాలకి సంబంధించిన కీలక వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటాడు. అదే విధంగా.. కంటెంట్ ను నమ్మి సినిమాలు చేసే వ్యక్తి. యంగ్ టాలెంట్ ను కూడా ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు.

Sai Pallavi

ఇప్పుడిప్పుడే ‘గీతా’ కాంపౌండ్ దాటి ‘లిటిల్ హార్ట్స్’ ‘రాజు వెడ్స్ రాంబాయ్’ వంటి సూపర్ హిట్ సినిమాలు అందించారు.ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టుని నిర్మించేందుకు రెడీ అయినట్టు టాక్ నడుస్తుంది. అది కూడా ఓ బయోపిక్ అని తెలుస్తుంది. వివరాల్లోకి వెళితే..ఒకప్పటి లెజెండరీ సింగర్ అయినటువంటి ఎం.ఎస్.సుబ్బలక్ష్మి బయోపిక్ ను బన్నీ వాస్ నిర్మించబోతున్నట్టు సమాచారం.

ఎం ఎస్ సుబ్బలక్ష్మీ సక్సెస్ స్టోరీ అందరికీ తెలిసినప్పటికి.. దాని వెనుక ఆమె పడ్డ కష్టం, ఎదుర్కొన్న చేదు అనుభవాలు వంటివి ఎన్నో ఉన్నాయనే ప్రచారం కొన్నేళ్ళుగా జరుగుతుంది. వాటిని ఆధారం చేసుకుని ఇప్పటి జెనరేషన్ కి అలాంటి గొప్ప వాళ్ళ కథ తెలుపాలనే ఉద్దేశంతో బన్నీ వాస్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.ఈ క్రేజీ బయోపిక్ ని ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించబోతున్నట్టు వినికిడి.

ఇక ఈ క్రేజీ బయోపిక్ లో సాయి పల్లవి(Sai Pallavi) ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ పాత్రని పోషించనున్నారట. ఈ పాత్రకి ఆమె అయితేనే న్యాయం చేయగలదు అనే ఉద్దేశంతో బన్నీ వాస్ అండ్ టీమ్ డిసైడ్ అయినట్టు తెలుస్తుంది.నిజంగా సాయి పల్లవి వంటి పెర్ఫార్మర్ ఉంటే.. చాలా మంది ప్రేక్షకులకి కథ రీచ్ అవుతుంది. అలాగే ఓటీటీ వంటి బిజినెస్ వ్యవరాల విషయంలో కూడా బాగా మార్కెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.గతంలో బన్నీ వాస్ నిర్మాణంలో సాయి పల్లవి ‘తండేల్’ సినిమా చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus