Sailesh Kolanu: సైంధవ్ కామెంట్స్ పై శైలేష్ రియాక్షన్ ఇదే.. ఏం చెప్పారంటే?

  • January 5, 2024 / 05:45 PM IST

సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న సినిమాలలో సైంధవ్ సినిమా ఒకటి కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శైలేష్ కొలను ఈ సినిమాకు దర్శకుడు కాగా ఆయన గత సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమా కూడా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సైంధవ్ గురించి విభిన్నమైన కామెంట్స్ వినిపిస్తుండగా శైలేష్ కొలను ఆ కామెంట్ల గురించి స్పందించారు. సైంధవ్ సినిమాలో కొన్ని హింసాత్మక సన్నివేశాలు ఉండగా ఆ సీన్స్ గురించి శైలేష్ రియాక్ట్ అయ్యారు.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన సైంధవ్ మూవీ గురించి శైలేష్ మాట్లాడుతూ సైంధవ్ సినిమాలో హింసాత్మక దృశ్యాలు ఉన్నాయని అయితే ఆ సీన్లను తొలగించినా సినిమాపై ప్రభావం కొద్దిగా కూడా మారదని కామెంట్లు చేశారు. హిట్2 సినిమాలో కేవలం క్లైమాక్స్ లో మాత్రమే హింస ఉంటుందని శైలేష్ కొలను పేర్కొన్నారు. సెనార్ బోర్డ్ కొన్ని సీన్స్ ను బ్లర్ చేయాలని అడిగినా నేను పెద్దగా పట్టించుకోనని శైలేష్ కొలను వెల్లడించారు.

భారీ స్థాయిలో ప్రేక్షకులు సినిమాను చూడాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. ఎంతో ప్రాధాన్యత కలిగిన సమాచారంతో ఈ సినిమా తెరకెక్కించానని ఆయన చెప్పుకొచ్చారు. ఈ సినిమాను ఎక్కువగా చిన్నారులు చూడాలని కోరుకుంటున్నానని ఆయన వెల్లడించారు. వెంకీ సార్ ఈ సినిమాలో చేసిన కొన్ని సీన్స్ సైతం చిన్నారులకు కమ్యూనికేట్ చేసే విధంగా ఉన్నాయని శైలేష్ కొలను పేర్కొన్నారు.

శైలేష్ కొలను (Sailesh Kolanu) రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. శైలేష్ కొలను తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. శైలేశ్ కొలను త్వరలో మరికొన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus