Saindhav Review in Telugu: సైంధవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 13, 2024 / 02:41 PM IST

Cast & Crew

  • వెంకటేశ్‌ (Hero)
  • శ్రద్దా శ్రీనాథ్ (Heroine)
  • బేబీ సారా, రుహానీ శర్మ , ఆండ్రియా జెర్మియా , ఆర్య , నవాజుద్దీన్ సిద్దిఖీ , జయప్రకాశ్‌ (Cast)
  • శైలేష్ కొలను (Director)
  • వెంకట్‌ బోయనపల్లి (Producer)
  • సంతోష్ నారాయణన్ (Music)
  • ఎస్. మణికందన్ (Cinematography)

“రానా నాయుడు”తో గేరు మార్చిన వెంకటేష్ నటించిన యాక్షన్ డ్రామా “సైంధవ్”. హిట్ సిరీస్ టు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ లోని యాక్షన్ సీన్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి వెంకీ మామ యాక్షన్ ఆడియన్స్ ను మెప్పించగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: చంద్రప్రస్థలోని కార్టెల్ గ్యాంగ్ లో కొన్నాళ్లపాటు ముఖ్యమైన వ్యక్తిగా చక్రం తిప్పి.. చనిపోయిన భార్యకి ఇచ్చిన మాట కోసం కూతురుతో కలిసి సామాన్య జీవితాన్ని గడుపుతుంటాడు సైంధవ్ (వెంకటేష్). తన కూతురుకి నరాలకి సంబంధించిన ఓ అరుదైన వ్యాధి ఉందని తెలుసుకొని.. దాని విరుగుడికి కావాల్సిన ఇంజెక్షన్ కి ఏకంగా 17 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని తెలుసుకొని షాక్ అవుతాడు.

తన కూతురుతోపాటు చాలా మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని తెలుసుకొని.. వాళ్లందరినీ ఆదుకోవాలని ఓ యుద్ధం మొదలెడతాడు. ఈ యుద్ధంలో సైంధవ్ కి ప్రత్యర్థిగా నిలుస్తాడు వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ). ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? పిల్లల ప్రాణాల్ని సైంధవ్ కాపాడగలిగాడా? వంటి ప్రశ్నలకి సమాధానమే ఈ చిత్రం.

నటీనటుల పనితీరు: వెంకటేష్ తన వయసుకు తగ్గ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయనలోని ఈ సరికొత్త యాంగిల్ ను చూడడం భలే ఉంది. కాకపోతే.. ఆయన క్యారెక్టర్ ఆర్క్ ను సరిగా మౌల్డ్ చేయకపోవడం వల్ల.. పాత్ర అనుకిన్న స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. నవాజుద్దీన్ ఈ చిత్రం కోసం స్వయంగా చెప్పుకున్న డబ్బింగ్.. కొన్ని చోట్ల బాగున్నా, ఇంకొన్ని చోట్ల మైమాస్ గా మారింది. ప్రతిసారీ ఆండ్రియాను తెలుగు మీనింగ్ కోసం అడగడం కూడా చిరాకు తెప్పించింది.

శ్రద్ధా శ్రీనాథ్ ను ఇండిపెండెంట్ ఉమెన్ గా ప్రెజెంట్ చేయాలనుకున్న ఆలోచన బాగున్నా.. దాని ఆచరణ సరిగా లేదు. ఆండ్రియా క్యారెక్టర్ సినిమాకు గ్లామర్ కానీ వెయిటేజ్ కానీ యాడ్ చేయలేకపోయింది. ఆర్య రోల్ బాగున్నా కూడా ప్లేస్మెంట్ బాలేదు.

సాంకేతికవర్గం పనితీరు: సంతోష్ నారాయణన్ నేపథ్య సంగీతం సినిమాకి మైనస్ గా నిలవడం బహుశా ఇదే మొదటిసారేమో. పాటలు వరకు పర్వాలేదనిపించుకున్నాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఒక వేరే ప్రపంచాన్ని చూపిస్తున్న అనుభూతి కోసం వాడిన టింట్ ఎఫెక్ట్ అండ్ లైటింగ్ బాగున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ మరియు సీజీ వర్క్ సినిమాకి మెయిన్స్ గా మారాయి. ఇక దర్శకుడు శైలేష్.. జాన్ విక్ తరహా ప్రపంచాన్ని బిల్డ్ చేద్దామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.

ఆ ప్రపంచాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అలాగే.. యాక్షన్ బ్లాక్స్ ను కూడా ఇంపాక్ట్ ఫుల్ గా కంపోజ్ చేయించుకోలేదు. అందువల్ల ఆడియన్స్ సినిమాకి, సినిమాలోని ఎమోషన్స్ కో కనెక్ట్ అవ్వలేరు. అలాగే.. యాక్షన్ బ్లాక్స్ ను కూడా పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయలేరు. సో, కథకుడిగా-దర్శకుడిగా శైలేష్ కొలను బొటాబోటి మార్కులతో గట్టెక్కాడు.

విశ్లేషణ: అంచనాలు లేకుండా, వెంకటేష్ లోని సరికొత్త యాంగిల్ ను చూసి ఎంజాయ్ చేయడం కోసం “సైంధవ్”ను ఒకసారి చూడొచ్చు.

రేటింగ్: 2.5/5

Click Here to Read In ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus