Sai Dharam Tej: ఆ తప్పే రిపబ్లిక్ కు మైనస్ అయిందా?

సాయితేజ్ హీరోగా దేవ కట్టా డైరెక్షన్ లో తెరకెక్కిన రిపబ్లిక్ మూవీ విడుదలై యావరేజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రీమియర్ షోలను చూసిన సెలబ్రిటీలు పాజిటివ్ రివ్యూలు ఇచ్చినా ప్రేక్షకుల నుంచి మాత్రం పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సాయితేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్య చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా సాయితేజ్ అభిమానులు రిపబ్లిక్ విజయాన్ని సాయితేజ్ ఆస్వాదించాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాలోని ఒక సన్నివేశం మెగాభిమానులతో పాటు సాధారణ అభిమానులను సైతం అవాక్కయ్యేలా చేస్తోంది.

సినిమాలోని ఒక సీన్ లో హీరో మోటార్ బైక్ పై వెళుతూ స్కిడ్ అయ్యి కింద పడతాడు. నిజ జీవితంలో కూడా సాయితేజ్ బైక్ పై నుంచి కింద పడి గాయాలపాలైన సంగతి తెలిసిందే. దర్శకుడికి అలాంటి షాట్ చిత్రీకరించాలని ఎలా అనిపించిందంటూ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే సాయితేజ్ పూర్తి ఆరోగ్యవంతుడిగా ప్రేక్షకుల ముందుకు రావాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో హీరో పాత్ర చనిపోవడం సినిమాకు మైనస్ అయింది. తెలుగు ప్రేక్షకులు సాధారణంగా ఇలాంటి క్లైమాక్స్ లను ఇష్టపడరు.

మాస్ హీరో అయిన సాయితేజ్ హ్యాపీ ఎండింగ్ ఉన్న కథలనే ఎంచుకుంటే బాగుండేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దర్శకుడు దేవ్ కట్టా మంచి కథనే ఎంచుకున్నా ఆలోచనలను తెరపై చక్కగా ఆవిష్కరించలేకపోయారనే చెప్పాలి. రిపబ్లిక్ ఫైనల్ రిజల్ట్ ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. హీరోయిన్ పాత్ర చిత్రణ కూడా బాలేదని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సాయితేజ్ నటన, రమ్యకృష్ణ పర్ఫామెన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus