పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించినటువంటి చిత్రం ఈ సినిమా మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అడ్వాన్స్ బుకింగ్ జరుపుకున్న నేపథ్యంలో ఈ సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయని తెలుస్తుంది. ఆన్లైన్ బుకింగ్ సౌకర్యం లేకపోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ల వద్దకు వెళ్తూ టికెట్లను బుక్ చేస్తూ ఉన్నారు
దీంతో థియేటర్ల దగ్గర అప్పుడే సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ సినిమాకు యుఎస్ లో కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది.ఒక్క యూఎస్ మార్కెట్ నుంచే ఈ చిత్రానికి ఏకంగా 50 వేలకి పైగా టికెట్స్ బుక్ అయినట్టు డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా నుంచి విడుదలైన మొదటి ట్రైలర్ విషయంలో ప్రభాస్ అభిమానులలో ఎక్కడో చిన్న నిరాశ ఉండేది కానీ సినిమా నుంచి విడుదల చేసినటువంటి సూరీడే అనే సాంగ్ సినిమాపై అంచనాలను పెంచేసాయి.
ఇటీవల విడుదలైన రెండో ట్రైలర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచడంతో టికెట్స్ కూడా భారీగానే బుక్ అవుతున్నట్టు సమాచారం. రెండో ట్రైలర్ వచ్చాక ఒక్క రోజులో 2 లక్షల డాలర్లు కి పైగా బుకింగ్ జరిగినట్టు తెలుస్తుంది. ఇలా ఒక్క రోజులోనే రెండు లక్షల డాలర్లు టికెట్లు బుక్ కావడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలా ఈ సినిమాకు ఈ స్థాయిలో టికెట్స్ బుక్ కావడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా టికెట్ల ధరలను కూడా పెంచటం గమనార్హం. కొన్ని ప్రాంతాలలో ఈ సినిమా 21వ తేదీ అర్ధరాత్రి నుంచి చూసే అవకాశాన్ని కల్పించబోతున్నారు. మరి ఈ సినిమా (Salaar ) ప్రేక్షకులను థియేటర్లలో ఎలా ఎంటర్టైన్ చేయబోతుందో తెలియాల్సి ఉంది.