Salaar, Tiger: ‘సలార్’ ‘టైగర్’ రిలీజ్ డేట్ల విషయంలో మార్పు.. ఏమైందంటే..!

ప్రభాస్ హీరోగా ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1 ‘ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’. ‘హోంబలే ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై విజయ్ కిరంగధూర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కాబోతుంది అని యూనిట్ ప్రకటించింది.

మొదటి భాగం (Salaar)  ‘సలార్ : సీజ్ ఫైర్’ పేరుతో రిలీజ్ కాబోతున్నట్లు కూడా చిత్ర బృందం వెల్లడించింది. సెప్టెంబర్ 28 న మొదటి భాగం విడుదలవుతుంది అని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ‘సలార్’ ఆల్రెడీ అక్కడ హాఫ్ మిలియన్ కలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతలో ఓ వార్త..! ‘సలార్’ సెప్టెంబర్ 28 న విడుదల కావడం లేదు అని..!

దీంతో ఒక్కసారిగా ఇది హాట్ టాపిక్ అయ్యింది. చిత్ర బృందం కూడా సెప్టెంబర్ 28 కి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనేది కచ్చితంగా చెప్పడం లేదు. కాబట్టి అందరిలో అనుమానాలు ఎక్కువయ్యాయి. డిసెంబర్ లో కానీ లేదంటే 2024 జనవరి 10 న ‘సలార్’ రిలీజ్ కాబోతుందని టాక్ నడుస్తుంది.

మరోపక్క రవితేజ హీరోగా తెరకెక్కుతున్న మొదటి పాన్ ఇండియా సినిమా ‘టైగర్ నాగేశ్వరరావు’ సెప్టెంబర్ 29 కి ప్రీపోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలుకైతే ఈ చిత్రం అక్టోబర్ 20 న దసరా కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఈ రిలీజ్ డేట్ ల విషయంలో చిత్ర బృందం క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పాలి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus