అత్యుత్సాహం కనబరుస్తూ థియేటర్లో టపాసులు పేల్చిన ఫాన్స్.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు!

Advertisement

ఆచార్య వంటి డిజాస్టర్ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి.ఈ సినిమా విజయదశమి సందర్భంగా విడుదల అయ్యి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా అన్ని భాషలలోనూ ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. విజయదశమి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సినిమా విజయం అందుకోవడంతో అభిమానులు థియేటర్ బయట టపాసులు పేలుస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు.

ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. అదేవిధంగా సత్యదేవ్ నయనతార వంటి వారు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లో సల్మాన్ ఖాన్ అభిమానులు అత్యుత్సాహం కనబరిచారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ ఇద్దరు కలిసి తార్ మార్ టక్కర్ మార్ పాటలో సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

ఇలా సల్మాన్ ఖాన్ మెగాస్టార్ ఇద్దరు ఈ పాటలో డాన్స్ చేయడంతో సల్మాన్ ఖాన్ అభిమానులు అత్యుత్వాహం కనబరిచారు. ఈ క్రమంలోనే ఏకంగా థియేటర్లో టపాసులు పేలుస్తూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.అయితే ఇలా ఉన్న ఫలంగా థియేటర్లో టపాసులు పేల్చడంతో సినిమా చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఒక్కసారిగా పరుగులు పెట్టారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు ఈ వీడియో పై స్పందిస్తూ విమర్శలు చేయగా మరికొందరు మాత్రం ఇదెక్కడి అభిమానం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల ఇతర ప్రేక్షకులు ఇబ్బంది పడడమే కాకుండా థియేటర్ యాజమాన్యానికి కూడా భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుంది అంటూ మరికొందరు అభిమానులు చేసిన పనిపై విమర్శలు కురిపిస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus