Salman Khan: దుబాయ్ లో భార్య, 17 ఏళ్ల కూతురు.. స్పందించిన స్టార్ హీరో!

బాలీవుడ్ లో నటుడు అర్భాజ్ ఖాన్ ‘పించ్’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన కొత్త సీజన్ మొదలైంది. దీని మొదటి ఎపిసోడ్ కి తన సోదరుడు, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను తీసుకొచ్చారు అర్భాజ్ ఖాన్. తాజాగా ఈ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు. ఈ షోలో సల్మాన్ తన ఫ్యామిలీ విషయాలు, సినిమాలు, వ్యక్తిగత సంగతుల గురించి మాట్లాడారు.

ఈ క్రమంలో గతంలో ఓ నెటిజన్ సల్మాన్ కు దుబాయ్ లో నూర్ అనే భార్య, 17 ఏళ్ల కూతురు ఉందని ఆరోపిస్తూ పోస్ట్ చేసిన ట్వీట్ ను ప్రస్తావిస్తూ నిజమేనా అని ప్రశ్నించాడు అర్భాజ్ ఖాన్. దీనిపై స్పందించిన సల్మాన్.. జనాలకు ఇలాంటి తప్పుడు సమాచారం ఎక్కడ నుండి వస్తుందో అర్ధం కావడం లేదని.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ నేను రియాక్ట్ అవ్వాలని ఎలా ఆలోచిస్తున్నారో తెలియడం లేదని అన్నారు. ఇప్పుడేంటి నాకు భార్య లేదు నేను ఇండియాలోనే ఉంటానని వాళ్లకు చెప్పాలా..? అని ప్రశ్నించాడు.

చిన్నప్పటి నుండి తను ఇండియాలోనే గెలాక్సీ అపార్ట్మెంట్ లో జీవిస్తున్నట్లు అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. ఇక ఆయన కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్ గా ‘రాధె’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం టైగర్ జిందా హై సీక్వెల్ లో నటిస్తున్నారు. అలానే బిగ్ బాస్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సీజన్ 15ని హోస్ట్ చేయనున్నారు సల్మాన్ ఖాన్.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus