Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!
- June 20, 2026 / 06:18 PM ISTByPhani Kumar
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తుంది. అది మాత్రమే కాదు ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ కూడా రివీల్ చేసినట్టు అయ్యింది. గత 4,5 రోజుల నుండీ సమంత ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం పై సమంత కానీ , సమంత టీమ్ కానీ క్లారిటీ ఇచ్చింది లేదు. అయితే నిన్న రిలీజ్ అయిన ‘మా ఇంటి బంగారం ‘ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తొలిరోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.
Samantha
వీకెండ్ మొత్తం భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉంది.నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకురాలు అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ‘ మా ఇంటి బంగారం ‘ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు చిత్ర యూనిట్ సభ్యులు. అయితే ఈ వేడుకలో వైట్ టీ-షర్ట్ ధరించిన సామ్ బేబీ బంప్ తో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం బయటపడింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సమంత గర్భవతి అనే విషయాన్ని ఆమె సన్నిహిత వర్గాలు కూడా కన్ఫర్మ్ చేశాయని క్లోజ్ సర్కిల్స్ చెబుతున్నాయి.

త్వరలోనే దీనిపై ఈ జంట నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ సమయంలో రాజ్ నిడిమోరుతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి రిలేషన్ లో ఉంటూ వచ్చారు రాజ్ – సామ్ (Samantha) దంపతులు. ఫైనల్ గా గతేడాది డిసెంబర్‌లో వీరు పెళ్లిపీటలు ఎక్కిన సంగతి తెలిసిందే. పెళ్లైన కొన్ని నెలలకే ఈ జంట తల్లిదండ్రులు కాబోతుండటంతో నెటిజన్లు, సమంత ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
నా కూతురు సినిమాల కోసమే పుట్టింది: స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
















