వెబ్ సైట్ ద్వారా సామాజిక సేవలు అందించడానికి రెడీ అయిన సమంత, ఉపాసన..!

సామాజిక బాధ్యతలు చేపట్టడం అలాగే సామాజిక సేవల్లో పాల్గొనడం వంటి విషయాల్లో ముందు వరుసలో ఉంటున్నారు.. అక్కినేని వారి ఇంటి కోడలు సమంత, అలాగే కొణిదెల వారి ఇంటి కోడలు ఉపాసన. తమ భర్తలు రాంచరణ్,నాగ చైతన్య ల పర్సనల్ ఫోటోలను, అప్డేట్స్ ను ప్రేక్షకులతో పంచుకోవడంతో వారి ఫిట్నెస్ విషయంలో కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో అయితే వీరిద్దరూ నిరంతరం సామాజిక సేవల్లో బిజీగా గడుపుతుండడం మనం చూస్తూనే వస్తున్నాం.

ఇప్పటికే ‘ప్రత్యూష సామాజిక సంస్థ’ ద్వారా రకరకాల సేవలు చేస్తూ వస్తోంది సమంత. అంగ వైకల్యం కలవారిని..అలాగే పేద ఆడపిల్లలను ఆదుకుని వారికి సాయం అందిస్తుంది. ఇక ఉపాసన అయితే.. అపోలో హాస్పిటల్ హెల్త్ ఆర్గనైజర్ గా మ్యాగజైన్ ఎడిటర్ గా ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఉపాసన బోలెడన్ని సోషల్ అవేర్ నెస్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అందుకే సమంత, ఉపాసన లను ‘మోస్ట్ పవర్ ఫుల్ స్టార్ వైఫ్స్’ అంటున్నారు నెటిజన్లు.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సైట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారట. ‘వేచి ఉండండి! @ Urlife.co.in ను అనుసరించండి’ అంటూ సోషల్ మీడియాలో వీరిద్దరూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ మెసేజ్ వైరల్ గా మారింది. సమంత- ఉపాసన లు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టబోయేది ఈ వెబ్ సైట్ ను అనుసరిస్తే తెలుస్తుందట. వీరిద్దరూ ఇంత గ్రేట్ ఇనీషియేటివ్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో వీరి పై ప్రశంసల వర్షం కురుస్తుంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus