క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు.. పేరు ఏదైనా.. అది అనుభవించే అమ్మాయిల బాధ వర్ణనాతీతం. ఆ విషయాన్ని బయటికి చెబితే ఒక సమస్య.. చెప్పకపోతే మరో సమస్య. అందుకే కనురెప్పల వెనుక కన్నీటిని దాచి పెట్టి.. బాధ పెదవిదాటనివ్వరు. ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు. అందుకే హాలీవుడ్ లో మొదలైన ‘మీటూ’ ఉద్యమం బాలీవుడ్ మీదుగా వచ్చి టాలీవుడ్ సినీ పరిశ్రమని కుదిపేసింది. తాజాగా చిన్మయి తనకి జరిగిన అనుభవాన్ని షేర్ చేయడంతో అది కొత్తమలుపు తిరిగింది. ఈ విషయాన్నీ సమంత సీరియస్ గా తీసుకుంది. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న వారందరూ భయపడకుండా ధైర్యంగా తెలపాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేస్తూ.. ‘‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మీ వాయిస్ తెలపండి. మీరు ఎవరో చెప్పకపోయినా సరే.. మీరిచ్చిన వాయిస్ మాత్రం ప్రపంచానికి వినిపిస్తుంది” అని ఈ మెయిల్ ఐడీస్ ఇచ్చింది. complaints@telugufilmchamber.in
complaints@apfilmchamber.com లకు ఫిర్యాదు చేయండి అని కోరింది.
అలాగే, మీరు పోస్టు ద్వారా వ్యక్త పరచాలనుకుంటే..Panel against sexual హరస్స్మెంత్, Dr D రామానాయుడు బిల్డింగ్, ఫిలింనగర్, హైదరాబాద్, తెలంగాణ 500096 అడ్రస్ కు మీకు ఎదురైనా చేదు అనుభవాలను పంపించండి” అని సమంత పోస్ట్ చేశారు. ఈ వేదిక వల్ల లైంగిక వేధింపులకు పాల్పడిన వారిని శిక్షించవచ్చని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.