తన భర్త కలెక్షన్స్ ను అధిగమించనున్న సమంత ‘ఓ బేబీ’..!

Advertisement

సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ చిత్రం రెండో వారంలో కూడా మంచి కలెక్షన్లను రాబడుతుంది. నందినీ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు పెట్టిన పెట్టుబడి మొత్తం వెనక్కి తెచ్చేసి.. లాభాల బాటలో నడిపిస్తుంది. వరల్డ్ వైడ్ ఈ చిత్రాన్ని 10 కోట్లకు అమ్మగా.. మొదటివారంలోనే 11 కోట్ల పైనే షేర్ ను రాబట్టి స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్లో ఈ చిత్రం జోరు ఇప్పటికీ తగ్గలేదు. ప్రీమియర్ల తోనే హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ చిత్రం.. ప్రీమియర్లకే 145,637 డాలర్లను రాబట్టగా… శుక్రవారం 152,716 డాలర్లను అలాగే.. శనివారం 150,006 డాలర్లను వసూలు చేసింది.

ఓవర్సీస్ లో ‘ఓ బేబీ’ చిత్రం ఇప్పటి వరకూ 750,000 డాలర్లను వసూల్ చేసినట్టు ట్రేడ్ పండితుల సమాచారం. ఈ వీకెండ్ కు ఈ చిత్రం మొత్తంగా 1 మిలియన్ మార్క్ చేరుకుంటుందని ట్రేడ్ పండితులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘ఓ బేబీ’ కలెక్షన్స్ తో సమంత తన భర్త నాగ చైతన్య వసూళ్ళను బీట్ చేసే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో నాగ చైతన్య బిగ్గెస్ట్ హిట్లయిన ‘ప్రేమమ్’ 829,098 డాలర్లను, అలాగే ‘మజిలీ’ 800,200 డాలరర్లను రాబట్టాయి. ఆ చిత్రాలని సమంత ‘ఓ బేబీ’తో బ్రేక్ చేయనుందన్న మాట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus