టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత నేడు తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీ సమంత పుట్టినరోజు కావడంతో ఈమెకు శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ నెటిజన్స్ ను ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే (Samantha) సమంత ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఇట్స్ గోయింగ్ టు బి ఏ గుడ్ ఇయర్’ అని కామెంట్ పెట్టారు. ఈ ఏడాది అంతా మంచి జరగాలని సమంత కోరుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ ఫోటో వైరల్ కావడంతో సమంత అభిమానులు తాను కోరుకున్న విధంగానే ఈ ఏడాది తనకు అంత మంచి జరగాలని కోరుకుంటూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే రెండు సంవత్సరాలుగా సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి విడాకులు ఇవ్వడంతో సమంత ఒంటరిగా మిగిలిపోయారు. ఇలా విడాకుల తీసుకొని ఒంటరిగా ఎంతో కుమిలిపోయి తనకు తానే ధైర్యం తెచ్చుకొని తిరిగి సినిమాలలో బిజీ అయ్యారు. ఇలా వరుస సినిమాలలో బిజీ అయిన నేపథ్యంలో మయోసైటిసిస్ ఈమెను వెంటాడింది. ఈ వ్యాధి కారణంగా దాదాపు కొన్ని నెలల పాటు సమంత పూర్తిగా బెడ్డుకు పరిమితమై చికిత్స తీసుకుంటున్నారు.
ఈ వ్యాధితో బాధపడుతున్నటువంటి ఈమె సినిమాలకు కూడా దూరమయ్యారు.ఈ రెండు సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సమంతకు ఈ ఏడాది అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సమంత అభిమానుల సైతం అదే ఆకాంక్షిస్తూ తనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈమె సిటాడెల్ వెబ్ సిరీస్ తో పాటు ఖుషి సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా