టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత ఒకవైపు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించడం ద్వారా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టాక కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇస్తే మాత్రమే ఈ ఇండస్ట్రీలో విజయాలను అందుకోవడం సాధ్యమవుతుంది. సమంత మాట్లాడుతూ ఉదయం సమయంలో రెండు గంటలు జిమ్ లో గడుపుతానని అది నా డైలీ రొటీన్ అని వెల్లడించారు.
జిమ్ కు వెళ్లని పక్షంలో మనసు ఏదోలా ఉంటుందని సమంత చెప్పుకొచ్చారు. చాలామంది ఉదయం సమయంలో నిద్ర లేవడానికి బద్దకిస్తారని సమంత కామెంట్లు చేశారు. నిద్ర మానేసి జిమ్ కు వెళ్లడం అవసరమా అని అనిపిస్తుందని సమంత చెప్పుకొచ్చారు. కొన్నిరోజులు ఎంత కష్టమైనా జిమ్ కు వెళ్లడం అలవాటు చేసుకోవాలని సమంత కామెంట్లు చేశారు. వర్కౌట్లు మొదలుపెట్టిన తర్వాత లైఫ్ స్టైల్ లో మార్పు వస్తుందని సమంత చెప్పుకొచ్చారు. ఇలా చేయడం ద్వారా కాన్ఫిడెన్స్ పెరుగుతుందని సమంత కామెంట్లు చేశారు.
మేం ఏది పడితే అది తింటాం డైట్ పాటించం అని చెప్పేవాళ్ల మాటలను అస్సలు నమ్మొద్దని సమంత చెప్పుకొచ్చారు. అమ్మాయిలు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం అని సమంత తెలిపారు. మానసికంగా కూడా అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ అని సమంత చెప్పుకొచ్చారు. శారీరకంగా కూడా అమ్మాయిలు దృఢంగా ఉండాలని సమంత కామెంట్ చేశారు. ఆఫీస్ పనులు, ఇంటి పనులతో చాలామంది డైట్ ను పట్టించుకోరని సమంత చెప్పుకొచ్చారు.
నాకు స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమని తెలంగాణ వంటకాలు అంటే చాలా ఇష్టమని సమంత కామెంట్లు చేశారు. బిర్యానీ, రొయ్యల కూరను ఇష్టంగా తింటానని ఆమె చెప్పుకొచ్చారు. డైటింగ్ ను ఎప్పుడైనా పక్కన పెడితే మరుసటిరోజు వర్కౌట్లు ఎక్కువగా చేస్తానని ఆమె కామెంట్లు చేశారు.
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!