Samantha: సమంతా కామెంట్స్ లో అంత మీనింగ్ ఉందా..!

  • March 12, 2022 / 09:48 AM IST

సమంత.. నిజానికి 4 ఏళ్ళ క్రితమే ఫేడౌట్ అయిపోవాల్సిన హీరోయిన్. కానీ అక్కినేని వారి ఇంటి కోడలు అవ్వడం వలన ఆమె కథా ప్రాధాన్యత కలిగిన సినిమాలు చేయడం మొదలుపెట్టింది. అవి హిట్లు అవ్వడంతో ఇంకా బాగా క్లిక్ అయ్యింది. కానీ మళ్ళీ ఈమె గ్లామర్ బాట పట్టడంతో సినిమా మళ్ళీ మొదటికి వచ్చింది. అక్కినేని ఫ్యామిలీతో సెపరేట్ అయిపోవడం, హాలీవుడ్, బాలీవుడ్లో ఆఫర్ల కోసం వెతుకులాడటం వంటివి జరుగుతుంది.

Click Here To Watch Now

ఏది ఏమైనప్పటికీ ‘ఫ్యామిలీ మెన్ సీజన్2’ ‘పుష్ప’ లో ఐటెం సాంగ్ వంటివి ఈమె రేంజ్ ను పెంచాయి.అయినా ఇంకా ఆఫర్లు ఫైనల్ చేసుకునే పనిలోనే ఉంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘ప్రేక్షకులు నా పై కురిపించిన ప్రేమను మాటల్లో వర్ణించలేను. ఊ అంటావా అనే పాట ఇలా ఇండియా వైడ్ హిట్ అవుతుందని నేను కలలో కూడా ఊహించలేదు.

తెలుగు ప్రేక్షకులే కాదు..ఈ పాటని అందరూ ఆదరించారు. అయితే నేను ఇప్పటివరకు చేసిన వర్క్ ను పక్కన పెట్టేసి మరీ దీనినే గుర్తిస్తుండడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది సమంత.అంటే ఆమె చాలా బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను కానీ ఐటెం సాంగ్ ఒక్కటే జనాలకి గుర్తుంది అనేది ఆమె ఒపీనియన్. ఇంకొన్ని రోజులు పోతే సమంత ఫ్రస్ట్రేషన్ మరింతగా బయటపడొచ్చేమో.

ఇక ప్రస్తుతం ఆమె నటించిన ‘శాకుంతలం’ ‘యశోద’ చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఈ మధ్యనే విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ తెరకెక్కించే సినిమాలో కూడా నటించడానికి ఓకె చెప్పింది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus