మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో యువ హీరో నితిన్ తొలిసారి నటించిన చిత్రం “అ.. ఆ”. ఇందులో సమంత, అనుపమ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఆనంద్ విహారి (నితిన్) ని అనసూయ (సమంత) డామినేట్ చేస్తుంది. కథ కూడా ఆమె మీదనే సాగుతుంది. హీరోయిజాన్ని పక్కన పెట్టి.. త్రివిక్రమ్ మీద ఉన్న అభిమానంతో నితిన్ ఈ సినిమాను ఒప్పుకున్నారు. సినిమాలో అనసూయ పాత్ర పై ఎక్కువ ఫోకస్ పెట్టినా నితిన్ బాధ పడలేదు. కాని సినిమా బయట కూడ ఆమె ఎక్కువ చేస్తుండడంతో తట్టుకోలేక పోతున్నట్లు నితిన్ కు సన్నిహితంగా ఉండే వారు చెప్పారు.
“అ.. ఆ” రెండు రోజుల్లో (జూన్ 2) విడుదల కానుంది. సినిమా ప్రచార కార్యక్రమంలో ఇతర నటీనటులతో కలిసి నితిన్ పాల్గొంటున్నాడు. అక్కడ తన కంటే సమంత ఎక్కువగా మాట్లాడుతోందని.. యాంకర్లు కూడా ఆమెనే ప్రశ్నలు అడుగుతున్నారని.. తనకి ప్రయారిటీ ఇవ్వడం లేదని నితిన్ మిత్రులతో వాపోయాడని సమాచారం. అంతే కాదు సినిమా పోస్టర్లు, హోర్డింగ్ లలోనూ సమంత ఫోకస్ అయ్యేలా ఉన్నాయని భాద పడ్డాడట. ఈ మధ్య సోషల్ మీడియాలో, వార్తల్లో నిలుస్తున్న సమంత కు ఈ విషయం తెలిసిందో లేదో?