సమంతను ఏడిపించిన మహేష్ బాబు!
- September 11, 2017 / 09:33 AM ISTByFilmy Focus
మహేష్ బాబు, సమంత కలిసి మూడు చిత్రాల్లో నటించారు. వాటిలో బ్రహ్మోత్సహం నిరాశపరిచినప్పటికీ దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. సినిమాలు హిట్ అయ్యాయి. దీంతో వీరిద్దరిది హిట్ కాంబినేషన్ గా పేరు దక్కించుకుంది. సమంతని సినిమాల్లోనే కాకుండా మహేష్ బాబు బయట కూడా ఆటపట్టిస్తుంటారు. మహేష్ మాటలని సమంత కూడా చాలా సరదాగా తీసుకుంటుంది. ఈ సారి మాత్రం కొంత ఎక్కువగా ఫీలయింది. మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించిన స్పైడర్ ఆడియో రిలీజ్ వేడుక శనివారం చెన్నై లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి కమెడియన్ సంతానం, గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి హోస్ట్ చేసారు.
మహేష్ వేదికమీదకు రాగానే… చిన్మయి అతనితో మాట్లాడింది. అప్పుడు మహేష్ “మీ (చిన్మయి) మాటలు వినగానే.. సడెన్ గా సమంత ఈ ఈవెంట్ లో ఉన్నట్లుగా అనిపించింది” అని చెప్పగానే వేడుకకు హాజరైన వారంతా నవ్వేసారు. ఈ మాటలనే సమంత అభిమానులు ఓ ఇమేజ్ రూపంలో ట్విట్టర్ లో ఆమెకు పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ని చూసిన సమంత ‘కన్నీళ్ళ’తో కూడిన మూడు ఏమోజీలను రిప్లైగా పోస్ట్ చేసి తన ఫీలింగ్ ని చెప్పారు. ఏ మాయ చేసావే చిత్రం నుంచి సమంతకు చిన్మయి డబ్బింగ్ చెబుతోంది. అందుకే మహేష్ ఇలా కామెంట్ చేసి.. నవ్వులను, ఆనంద భాష్పాలను రప్పించారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















