Samantha: ఆ పని చేస్తూ కోట్లు సంపాదిస్తున్న సమంత!

అందం, అభినయంతో విజయాలను అందుకుంటున్న సమంతకు సోషల్ మీడియాలో సైతం భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ లతో విజయాలను అందుకుంటున్న అతికొద్ది మంది హీరోయిన్లలో సమంత కూడా ఒకరు. వివాదాల ద్వారా సమంత వార్తల్లో నిలుస్తున్న సమంత సమయం వచ్చినప్పుడు వాటి గురించి స్పందించాలని భావిస్తున్నట్టు బోగట్టా. సినిమాను బట్టి సమంత పారితోషికం తీసుకుంటున్నారు. మరోవైపు సమంత వరుసగా యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

కొన్ని నెలల క్రితం ఒక టూత్ పేస్ట్ యాడ్ లో కనిపించిన సమంత ప్రస్తుతం మరో టాప్ బ్రాండ్ షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తోంది. ట్విట్టర్ లో యాక్టివిటీని తగ్గించిన సమంత ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. బ్రాండ్స్ ద్వారా ఆమెకు కోట్ల రూపాయలలో ఆదాయం వస్తుందని సమాచారం. ఇన్ స్టాగ్రామ్ లో సమంత ఏవైనా కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తే ఒక్కో పోస్ట్ కు లక్షల్లో తీసుకుంటున్నారు.

సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటిస్తున్న సమంత అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలను చెబుతున్నారు. సినిమాలను తగ్గిస్తున్నా కొత్త బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతూ సమంత కెరీర్ ను బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో బ్రాండ్స్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్న హీరోయిన్ సమంత మాత్రమే అని చెప్పాలి. ఈ నెల 7వ తేదీన సమంత చైతన్యల పెళ్లిరోజు కాగా సమంత చైతన్యల గురించి వైరల్ అవుతున్న రూమర్లకు సంబంధించి ఆరోజు క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus