Samantha: మాస్ సాంగ్ కు ఓకే చెప్పిన సమంత.. కానీ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత పుష్ప ది రైజ్ సినిమాలోని ఊ అంటావా సాంగ్ ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు సమంత బోల్డ్ రోల్స్ లో కూడా అద్భుతంగా చేయగలదని ప్రూవ్ అయింది. అయితే తాజాగా సమంత మరో మాస్ సాంగ్ కు ఓకే చెప్పిందని సమాచారం అందుతోంది. సమంత ప్రధాన పాత్రలో యశోద సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

పుష్ప సినిమాలో ఊ అంటావా సాంగ్ ను మించే విధంగా ఈ సాంగ్ ఉండదనుందని సమాచారం అందుతోంది. ఒక సాంగ్ మినహా యశోద మూవీ షూటింగ్ పూర్తైందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఆ ఒక్క సాంగ్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన స్పెషల్ సెట్ లో జరుగుతోందని తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం గమనార్హం. మణిశర్మ అందించిన సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

యశోద సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో ప్రకటన వెలువడనుందని సమాచారం. సమంత ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొన్నిరోజుల గ్యాప్ లోనే సమంత నటించిన యశోద, శాకుంతలం థియేటర్లలో రిలీజ్ కానున్నాయని సమాచారం అందుతోంది. తర్వాత ప్రాజెక్ట్ లతో సమంత ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది. చైతన్య నుంచి విడిపోయిన తర్వాత కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సమంతకు కీలకమని చెప్పవచ్చు.

సమంత సైతం కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే కథలకు మాత్రమే సమంత ఓటేస్తున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సామ్ విజయాలు అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒక్కో సినిమాకు సమంత 2 నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus