Samantha Bag Cost: వామ్మో సమంత హ్యాండ్ బ్యాగ్ ఒక ఇల్లు కట్టుకోవచ్చు తెలుసా?

  • November 6, 2023 / 06:55 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్ కనుక చూస్తే అందులో సమంత పేరు కూడా ఉంటుంది అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో గత దశాబ్ద కాలంగా హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలకు చిన్న విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. సమంత తన వ్యక్తిగత కారణాలవల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ ఈమె మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా తరచూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే సమంత ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె బ్లూ కలర్ డీప్ నెక్ ఉన్నటువంటి డ్రెస్ ధరించి పెద్ద ఎత్తున ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలలో సమంత చాలా స్టైలిష్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇక ఈ ఫోటోలలో భాగంగా సమంత తన చేతిలో ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని కూడా ఫోటోలు దిగారు. ఇక ఈ హ్యాండ్ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఈ హ్యాండ్ బ్యాగ్ ధర ఎంత ఉంటుందని ఆరా తీయడం మొదలుపెట్టారు. సమంత ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారని తెలుస్తోంది.

ఈ హ్యాండ్ బ్యాగ్ కోసం సమంత (Samantha) ఏకంగా 10 లక్షల రూపాయలు ఖర్చు చేశారు అనే విషయం తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఈ చిన్న హ్యాండ్ బ్యాగ్ కోసం ఏకంగా 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారా ఈ హ్యాండ్ బ్యాగ్ ఖరీదుతో ఒక సాధారణ కుటుంబం మంచి ఇల్లు కట్టుకొని జీవితాంతం సంతోషంగా ఉండవచ్చు అంటూ ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు. అయితే సెలబ్రిటీలు తమకు నచ్చిన వస్తువుల కోసం ఇలా డబ్బులు ఖర్చు చేయడం సర్వసాధారణమైన విషయమనే చెప్పాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus