అవకాశం ఇచ్చి చూడండి – సమంత

పెళ్లికాకముందు మాత్రమే కాదు.. పెళ్లి అయిన తర్వాత కూడా సమంత విజయాలతో దూసుకుపోతున్నారు. అప్పటికన్నా ఇప్పుడు అన్ని విధాలుగా పరిణితి కనబరుస్తున్నారు. రంగస్థలంలో రామలక్ష్మీగా మెప్పించిన ఈమె.. మహానటి చిత్రంలో మధురవాణిగా సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని ఔరా అనిపించారు. తాజాగా తమిళంలో విడుదలైన ఇరంబుతిరై చిత్రంలోను సమంత రతీదేవిగా ఎక్కువమార్కులు కొట్టేశారు. ఓ దినపత్రిక ఈ సినిమాకి 4/5 పాయింట్లు ఇవ్వడం విశేషం. ఆ రివ్యూలో కతిరావన్, సత్యమూర్తి పాత్రలు ప్రత్యేకమైనవి కావు. కానీ సమంత పోషించిన రతీదేవి పాత్ర బాగా ఆకట్టుకుంది” అని వ్యాసం ప్రచురించింది. కథ రతీదేవి చుట్టు తిరగకపోయినా ఆమెది ప్రధానమైన పాత్ర అని రివ్యూలో వెల్లడించింది.

ఈ రివ్యూను పోస్టు చేస్తూ సమంత దర్శకుడు మిత్రన్‌కు అభినందనలు తెలిపారు. “ఇప్పుడు హీరోయిన్లకు మంచి పాత్రలు ఓ రిక్వెస్ట్ కాదు. ఓ డిమాండ్. ఇండస్ట్రీలో టాలెంట్‌కు కొదువలేదు. అవకాశం లభిస్తే తెరమీద విజృంభించడానికి సిద్ధంగా ఉన్నారు” అని సమంత ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ టాక్ ఆఫ్ టాలీవుడ్ అయింది. సమంత ఒక్కరి గురించే కాకుండా పరిశ్రమలోని తోటి నటీనటుల గురించి మాట్లాడి అందరి అభిమానాన్ని అందుకుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరంబుతిరై తెలుగులో అభిమన్యుడు పేరుతో “మే 18 “న తెలుగులో విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus