Samantha in Pushpa: బన్నీతో సమంత మాస్ స్టెప్పులు!

Advertisement

అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ దాదాపు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. ప్రస్తుతం ఓ పాట షూటింగ్ జరుగుతుండగా.. ఇంకొక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అది కూడా ఐటెం సాంగ్. ఈ పాటలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కనిపించనుందని చాలా రోజులుగా వార్తలొస్తున్నాయి. పూజాహెగ్డే, తమన్నా లాంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా సమంతను తీసుకున్నట్లు సమాచారం. సుకుమార్ డైరెక్ట్ చేసిన ‘రంగస్థలం’ సినిమాలో సమంత నటించిన సంగతి తెలిసిందే.

అప్పటినుంచి సుకుమార్ తో ఆమెకి మంచి బాండ్ ఏర్పడింది. ఆ గౌరవంతోనే సుకుమార్ అడిగిన వెంటనే ఐటెం సాంగ్ లో నటించడానికి ఒప్పుకుంది. మొత్తానికి బన్నీతో మాస్ స్టెప్పులు వేయడానికి సమంత రెడీ అవుతుందన్నమాట. నవంబర్ మూడో వారం నుంచి ఈ పాట షూటింగ్ జరగబోతుంది. ప్రస్తుతం సమంత వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన సమంత శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో ఓ సినిమా,

అలానే ఓ బైలింగ్యువల్ సినిమాల్లో నటించబోతుంది. వీటితో పాటు బాలీవుడ్ లో ఓ సినిమా సైన్ చేసిందని టాక్. తాప్సీ ప్రొడక్షన్ హౌస్ లో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus