అనారోగ్యం నుండి కోలుకున్నాక మొన్నీమధ్యే వరుసగా షూటింగ్‌లు చేస్తున్న సమంత ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటానని బంద్ ప్రకటించింది. ఇది పుకారు కాదు.. ఆమె అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన విషయం. ఈ మేరకు ఆమె టీమ్ నుండి అధికారిక సమాచారం వచ్చిది. ఓ సంవత్సరం పాటు సినిమాలకు, షూటింగ్‌లకు దూరంగా ఉంటూ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాలని అనుకుంటోందట. ఆమె టీమ్ తెలిపిన వివరాల ప్రకారం అయితే ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమా చేస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్ జరుగుతోందని, మరో మూడు రోజుల్లో షూటింగ్ పూర్తవుతుంది. అలాగే ఆమె వరుణ్ ధావన్‌తో కలసి చేస్తున్నా ‘సిటడెల్’ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ కూడా ఆఖరి దశకు చేరుకుందట. దీంతో ఇక కొత్త కమిట్‌మెంట్స్‌ను ఆపేసి సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యిందట. ప్రస్తుతానికి సమంత తెలుగు, బాలీవుడ్‌లో కొత్త సినిమాలేవీ సైన్ చేయలేదని, మరో ఏడాది వరకు సైన్ చేయబోదని టీమ్ సమాచారం.
లాంగ్ బ్రేక్ తీసుకొని తన ఆరోగ్యం మరింత కుదుటపడేందుకు అవసరమైన ట్రీట్‌మెంట్ తీసుకుంటుందట. అలాగే ఇప్పటివరకు కొత్త సినిమాల కోసం తీసుకున్న అడ్వాన్స్‌లను కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేస్తుందని తెలిపింది. దీంతో ఇప్పటికిప్పడు ఈ నిర్ణయం ఏంటని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మొన్నటికి మొన్న విదేశాల్లో పబ్బుల్లో ‘ఉ అంటావా ఊఊ అంటావా’ అంటూ బాటిల్ పట్టుకుని డ్యాన్స్ చేసిన సామ్ (Samantha) ఒక్కసారిగా ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుంది అని అనుకుంటున్నారు.
మరోవైపు ‘ఖుషి’, ‘సిటడెల్’ ప్రమోషన్స్ సంగతి ఏంటి అనే చర్చ కూడా నడుస్తోంది. ఒకవేళ సమంత ఆ ప్రచారాలకు వస్తే కొన్ని వైరల్ విషయాల మీద ఆమె నుండి సమాచారం తెలుసుకోవచ్చు అనుకున్నవాళ్లకు కూడా ఆ అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఒక ఏడాది వరకు సమంత మీడియా ముందుకు రాకపోవచ్చు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!