Samantha: నెల రోజులు వెనక్కి వెళ్ళిన ‘ మా ఇంటి బంగారం’
- May 7, 2026 / 08:52 AM ISTByPhani Kumar
దాదాపు 3 ఏళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడానికి వస్తున్న సమంతకు(Samantha).. ప్రస్తుత పరిస్థితులు కొద్దిగా అడ్డంకిగా మారాయి. ఈ సమ్మర్ బరిలో సందడి చేస్తుందనుకున్న ‘మా ఇంటి బంగారం’ సడెన్‌గా వాయిదా పడింది.
Samantha
అందుకు కారణం IPL ఫీవర్ పీక్స్‌లో ఉండటం అనే చెప్పాలి. దాని వల్ల కలెక్షన్లపై ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశ్యంతో డిస్ట్రిబ్యూటర్ల సూచన మేరకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు.వాస్తవానికి ఈ సినిమాను మే 15న రిలీజ్ చేయాలని ముందుగా అనౌన్స్ చేశారు.

కానీ ఇప్పుడు పక్కా స్ట్రాటజీతో జూన్ 19కి వాయిదా వేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీకి కరెక్ట్‌గా రెండు వారాల గ్యాప్ ఇచ్చి థియేటర్లలోకి దిగుతుంది ‘మా ఇంటి బంగారం’. జూన్‌లో బాక్సాఫీస్ వద్ద సోలోగా మ్యాగ్జిమమ్ పబ్లిక్ అటెన్షన్ లాగాలన్నదే టీమ్ ప్లాన్ గా అర్దం చేసుకోవచ్చు.ఆరోగ్య, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్.. ఫుల్ లెంగ్త్ రోల్ పోషించిన సినిమా ఇది.అంతేకాకుండా, గతేడాది డిసెంబర్‌లో డైరెక్టర్ రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నటిస్తున్న సినిమా కూడా ఇదే.
తన సొంత బ్యానర్ ‘ట్రలాలా మూవింగ్ పిక్చర్స్’ పై సమంత ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఆమె భర్త రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరుతో కలిసి కో-ప్రొడ్యూసర్‌గా, షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు. నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ పర్ఫెక్ట్‌గా బ్లెండ్ అయ్యాయట. మరీ ముఖ్యంగా సామ్ ఫస్ట్ టైమ్ డూప్ లేకుండా రియల్ స్టంట్స్ చేయడం సినిమాకు హైలైట్‌గా మారనుంది.ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో జరుగుతున్నాయి.
రీసెంట్‌గా రిలీజైన ‘తస్సాదియా’ సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. అందులో సామ్ వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులకు సోషల్ మీడియాలో రీల్స్ దద్దరిల్లుతున్నాయి. వెన్నెల కిషోర్‌తో ఆమె చేసిన ఫన్నీ ప్రమోషనల్ ఇంటర్వ్యూ కూడా సినిమాపై బజ్ పెంచేసింది. రిలీజ్ వాయిదా పడటంతో ప్రస్తుతం ఆపిన ప్రమోషన్స్‌ను జూన్ ఫస్ట్ వీక్ నుంచి మళ్లీ స్పీడప్ చేయనున్నారు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి, అంజలి, శ్రీముఖి, శ్రీలక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.











