Samantha: గుడిలో సమంత ప్రత్యేక పూజలు.. వీడియో లీక్!

  • July 7, 2023 / 12:13 PM IST

హీరోయిన్ సమంత కెరీర్ ప్రస్తుతం అంత సాఫీగా సాగడం లేదు. ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంది. ఛైతన్యతో విడాకుల తర్వాత డిప్రెషన్ కి గురైన సమంత తిరిగి తన సినిమాలతో బిజీగా మారింది. అంతలోనే ఆమెని మాయోసైటిస్ అనే వ్యాధి చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని కాస్త కోలుకుంది. ట్రీట్మెంట్ తర్వాత కూడా సమంత కొంతకాలం నీరసంగానే కనిపించింది. ఎట్టకేలకు కోలుకున్న సామ్ శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది.

యశోద చిత్రంతో హిట్ కొట్టింది. ప్రస్తుతం (Samantha) సామ్ విజయ్ దేవరకొండ సరసన మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత హెల్త్ ప్రాబ్లమ్ కారణంగానే ఖుషి షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఖుషి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ దేవరకొండ తో మహానటి తర్వాత మరోసారి సామ్ ఈ మూవీలో నటిస్తోంది.

శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో లీక్ అయి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోలో సమంత విజయ్ దేవరకొండ ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వధూవరులుగా కనిపిస్తున్నారు. అక్కడ ఓ టెంపుల్ లో పూజ జరుగుతోంది. చూస్తుంటే పెళ్లి సెటప్ లాగా అనిపిస్తోంది.

రెడ్ శారీలో సమంత ఎంతో అందంగా ఉంది. ఇక విజయ్ దేవరకొండ పంచెకట్టుతో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సమంత మరోసారి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆరోగ్య కారణాల వల్ల సామ్ ఏడాది పాటు షూటింగ్స్ కి దూరంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బ్రేక్ తీసుకుంటోందట. దీనితో తదుపరి చిత్రాలకు తీసుకున్న అడ్వాన్స్ లని నిర్మాతలకు సామ్ తిరిగి ఇచ్చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus