Samantha: సమంత ఇలా అయిపోయిందేమిటి… సర్జరీ వికటించిందా?

సమంత కొంత కాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటోంది. వరుస సినిమాల్లో బిజీగా ఉండడం వలనో లేక తన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ తో ఇంకా కోలుకోకపోవడంవలనో కానీ ఆమె సోషల్ మీడియాలో కనిపించడం లేదు. మొన్నామధ్య ‘అమ్మ చెప్పింది’ అంటూ ట్యాగ్ లైన్ పెట్టి ఏవేవో కోట్స్ షేర్ చేసిన సమంత.. కరణ్ జోహార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత సైలెంట్ అయిపోయింది. ఎప్పుడో అమావాస్యకి పౌర్ణానికి ఒక పోస్ట్ పెడుతుంది కానీ సోషల్ మీడియాలో ఏమాత్రం ఆమె యాక్టివ్ గా ఉండటం లేదు.

ఈ క్రమంలో ఆమెపై ఏదో రూమర్ పుట్టుకొస్తూనే ఉంది. అన్నీ ఎలా ఉన్నా గత నెలలో సమంతకు చర్మ వ్యాధి సోకిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని సమంత టీం ఖండించింది. అలాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ ఎందుకు అంటూ వాళ్ళు చెప్పి ఊరుకున్నారు. అదే సమంత అయితే ఏదో ఒక కౌంటర్ విసిరేది. కానీ ఆమె అలా చేయడం లేదు. సమంత ఇంతలా సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణం ఏంటో అర్ధం కానీ ప్రశ్న.

ఇక ఇప్పుడు సమంత ఏకంగా మొహానికి సర్జరీ చేయించుకుందనే ప్రచారం మొదలైంది. ఆమె ఓ యాడ్ కోసం చేసిన ప్రచారంలో భాగంగా బయటకొచ్చిన ఫోటోలు వీటికి బలం చేకూర్చాయాని చెప్పాలి. ఇందులో సమంత నిజంగానే అదో మాదిరిగా కనిపిస్తుంది. మునుపటి క్యూట్ నెస్ అయితే లేదు. ఆమె స్మైల్ కూడా చాలా తేడాగా ఉంది. ఇంతలా ఆమె గుర్తుపట్టలేని విధంగా మారిపోవడానికి.. సర్జెరీ వికటించడమే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus