Samantha, Allu Arha: సమంతకు బన్నీ స్పెషల్ థాంక్స్!

Advertisement

అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ రూపొందిస్తోన్న ‘శాకుంతలం’ సినిమాతో అర్హ నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో అర్హ నటించబోతున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇందులో అర్హ పాత్ర ఎలా ఉండబోతోందనే దాని గురించి తాజాగా సమంత చెప్పుకొచ్చింది. అర్జ మొదటి సీన్ ఎలా చేసిందో కూడా సమంత తెలిపింది.

కూతురి సినీ ఎంట్రీను ఉద్దేశిస్తూ.. ‘అల్లు వారి నాల్గో తరం కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారంటూ’ బన్నీ ఎమోషనల్ ఆయిన సంగతి తెలిసిందే. ఇక సమంత అర్హను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే మొదలైన ఈ సినిమా షూటింగ్ లో అర్హ జాయిన్ అయింది. ఈ మేరకు ‘శాకుంతలం’ టీమ్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

అర్హ ఎంట్రీపై సమంత కామెంట్ చేసింది. ‘ఫస్ట్ టేక్ అయిపోయింది. అదరగొట్టేసింది. ఆమెకి రాసిన డైలాగ్స్ అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయ్..’ అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ పై స్నేహారెడ్డి స్పందించింది. షాట్స్ లో అర్హకు సాయం చేస్తున్నందుకు సమంతకు థాంక్స్ చెప్పింది. బన్నీ సైతం ఈ పోస్ట్ పై స్పందిస్తూ.. ”థాంక్యూ సో మచ్” అంటూ చెప్పుకొచ్చారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus