#RRR సినిమాలో తాను నటించడంపై క్లారిటీ ఇచ్చిన సమంత!

బాహుబలి సినిమాల తర్వాత దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి చేస్తున్న #RRR సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి తొలిసారి నటిస్తున్న ఈ చిత్రాన్నిభారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సమంత నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై సమంత నేడు స్పందించారు. ఆమె నటించిన యు టర్న్ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన సమంత  #RRR మూవీలో ఛాన్స్ పై మాట్లాడారు.

“#RRR చిత్రంలో నేను హీరోయిన్ గా నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో, హీరోయిన్ పాత్రను రిజెక్ట్‌ చేశానని గతంలో వచ్చిన వార్తలు.. పూర్తిగా అవాస్తవం” అని సమంత స్పష్టం చేశారు. యు టర్న్ సినిమా తర్వాత భర్త నాగచైతన్యతో కలిసి నటించనున్నారు.  “నిన్నుకోరి” హిట్ తో మంచి పేరు తెచ్చుకున్న శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. హరీశ్ పెద్ది, సాహు గారపాటి కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus