స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు దాటింది. తమిళనాడుకు చెందిన అమ్మాయే అయినప్పటికీ.. సమంతని తెలుగు ప్రేక్షకులు బాగా ఓన్ చేసుకున్నారు. ‘ఏమాయ చేసావె’ ‘బృందావనం’ ‘దూకుడు’ వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది సమంత. అంతేకాదు అవన్నీ సూపర్ హిట్లు అవ్వడంతో గోల్డెన్ లెగ్ అనే బిరుదును కూడా సొంతం చేసుకుంది. ఆ తర్వాత పెద్ద సినిమా అంటే ‘సమంత మస్ట్’ అని దర్శకనిర్మాతలతో పాటు ప్రేక్షకులు సైతం డిమాండ్ చేసేలా ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది.
తర్వాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలందరితో సినిమాలు చేసే అవకాశాలు పొందింది. ఇప్పుడు నిర్మాతగా కూడా సినిమాలు చేస్తోంది. ‘శుభం’ తో హిట్టు కొట్టిన సమంత.. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే మరో సినిమాని ప్రారంభించింది. ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో సమంత ముచ్చటించింది. ఇందులో భాగంగా ఆమె చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్ చేయడం అనేది తనకి బాగా కలిసొచ్చిందట. హీరోయిన్ గా గ్లామర్, డాన్స్ పై మాత్రమే దృష్టి పెట్టి ముందుకు రావడం అనేది స్టార్ డమ్ తెచ్చుకోవడానికి షార్ట్ కట్ అయ్యిందని చెప్పింది. అందరికీ దూరంగా ఉండి ఆ ఒక్క పనే చేయడం తనని స్టార్ గా నిలబెట్టింది అని.. అందుకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా.. అన్నీ ఫాస్ట్ గా అయిపోయినట్టు తెలిపింది.
కానీ ఇప్పుడైతే నచ్చిన పాత్రలు చేయడం సంతృప్తినిస్తుంది అని.. అలాగే నిర్మాణ రంగంలోనే కాకుండా మరో 10 బిజినెస్..లు చక్కబెట్టడం కూడా సులువుగా అనిపిస్తుందని సమంత చెప్పుకొచ్చింది.ఇదే క్రమంలో 15 ఏళ్ళ క్రితం కేవలం గ్లామర్ కి మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి సినిమాలు చేయడం అనేది ఇప్పుడు కష్టంగా అనిపిస్తుందని తెలిపింది సమంత.