Samantha: మంచితనం వల్లే అది సాధ్యమవుతుంది.. సమంత పోస్ట్ వైరల్!

సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత సినిమానే తన ప్రపంచంగా బతుకుతున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ముఖ్యంగా విడాకుల సమయంలో సమంత తనలో ఉన్న భావాలు అన్నింటిని పోస్టుల రూపంలో అభిమానులతో పంచుకున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా తన మనసులో భావాలను బయట పెట్టిన సమంత నిత్యం ఏదో ఒక పోస్టు ద్వారా అభిమానులను సందడి చేస్తుంటారు.

అయితే కొన్నిసార్లు ఈమె చేసే పోస్టులు ఎవరిని ఉద్దేశించి చేస్తుందనే విషయం తెలియక సతమతమవుతూ ఉంటారు. తాజాగా సమంత అలాంటి పోస్ట్ ఒకటి చేశారు. ఈ విధంగా సమంత పోస్ట్ చేస్తూ తనను తానే మంచిదాన్ని అని చెప్పుకున్నట్లు ఉంది. ఈ క్రమంలోనే సమంత సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ మనం ఇతరులలో మంచితనాన్ని చూస్తున్నాము అంటే.. మనలో కూడా మంచితనం ఉంది అంటూ ఈమె ఒక ఇంగ్లీష్ కొటేషన్ పోస్ట్ చేశారు.

ఈ విధంగా సమంత ఈ పోస్ట్ చేయడంతో చాలా మంది సమంత పోస్ట్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి.. సమంత అందరితో మంచితనంగా ఉంటుందని తనకు తానే మంచిదనే ట్యాగ్ ఇచ్చుకున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈమె సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా ప్రస్తుతం ఈమె యశోద, ఖుషి సినిమాలో నటిస్తున్నారు. కోలీవుడ్ హీరో విజయ్ దళపతి సరసన విజయ్ 67 సినిమాలో ఈమె నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus