Samantha: నన్ను నేను మార్చుకోవాలి.. సామ్ షాకింగ్ పోస్ట్!

  • October 4, 2021 / 03:46 PM IST

స్టార్ హీరోయిన్ సమంత విడాకుల ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో తొలిసారి పోస్ట్ పెట్టారు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉండే సమంత పేర్లు ప్రస్తావించకుండా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆసక్తికర కామెంట్లు చేశారు. ఈ ప్రపంచాన్ని మార్చాలని తాను భావిస్తే మొదట తనను తాను మార్చుకోవాలని సమంత తన పోస్ట్ లో చెప్పుకొచ్చారు. మనమే అన్ని పనులు చేసుకోవాలని షెల్ఫ్ లో ఉన్న దుమ్మును దులపాలని సమంత పేర్కొన్నారు. మధ్యాహ్నం వరకు నిద్రపోతూ మనం చేయాలని అనుకునే లక్ష్యాల గురించి కలలు కనకూడదని సమంత పోస్ట్ లో పేర్కొన్నారు.

సమంత ఇకపై ఒంటరిగానే తన లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేస్తానని చెప్పకనే చెప్పేశారు. సమంత ఈ కామెంట్లతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో సిటీని వీడియో తీసి పెట్టడంతో సమంత మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతారనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. అయితే సమంత అభిమానులు మాత్రం ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. విడాకుల ప్రకటన తర్వాత సమంత చాలా బాధ పడ్డారని తెలుస్తోంది. సమంత ఏ విషయాన్ని అయినా పరోక్షంగా చెప్పడానికే ఎక్కువగా ఇష్టపడతారు.

నటిగా, హోస్ట్ గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న సమంత భవిష్యత్తులో ఎలాంటి పాత్రలను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది. చైసామ్ విడాకులకు సంబంధించి వేర్వేరు కథనాలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. తెలుగులో సమంత నటించిన శాకుంతలం 2022లో రిలీజ్ కానుండగా సమంత నటించిన కోలీవుడ్ మూవీ కథు వాకుల రెండు కాదల్ దీపావళి కానుకగా ఓటీటీలో రిలీజ్ కానుంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus