Samantha in Pushpa: పుష్ప ఐటమ్ సాంగ్.. సమంత రెమ్యునరేషన్ ఎంతంటే?

  • November 16, 2021 / 08:00 PM IST

నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత కాస్త విబిన్నంగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆమె సెట్స్‌పైకి వచ్చే రెండు ప్రాజెక్ట్‌లను ప్రకటించింది. ఇప్పుడు పుష్పలో ఓ స్పెషల్ ఐటమ్ నంబర్ కోసం ఆమె డ్యాన్స్ చేయనుందని గత వారం నుంచి టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సుకుమార్ స్పెషల్ ఐటెమ్ సాంగ్ కోసం సమంతను సంప్రదించారని అఫీషియల్ గా క్లారిటీ కూడా వచ్చేసింది. సమంత ఆ ఆఫర్ వినగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

రంగస్థలం సినిమాకు సుకుమార్, సమంత కలిసి పనిచేశారు. రంగస్థలంలో ఐటెం నంబర్ చేయడానికి సుకుమార్ స్టార్ నటి పూజా హెగ్డేని తీసుకున్నాడు. కాబట్టి, పుష్పలో ఒక ప్రత్యేక పాట కోసం డ్యాన్స్ చేయడానికి సమంతను ఆఫర్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇక ఆమెకు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నారట.ప్రస్తుతం సమంత లేడి ఓరియెంటెడ్ సినిమాలకు 4కోట్ల వరకు పారితోషికం డిమాండ్ చేస్తోంది. ఇక ఐటెమ్ సాంగ్ కోసం 1 కోటి 50లక్షల వరకు డిమాండ్ చేసినట్లు సమాచారం.

ఇక పుష్పలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. ఇక బన్నీ, సమంత కలిసి స్క్రీన్ షేర్ చేసుకుని చాలా రోజులైంది. మరి ఐటెమ్ సాంగ్ లో ఈ జంట ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో చూడాలి. పుష్ప సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus