విద్యార్థుల భోజనానికి సాయం చేయమని అభిమానులను కోరిన సమంత

ఏ మాయ చేసావే, ఈగ, దూకుడు, అత్తారింటికి దారేది, మనం, అ..ఆ , రంగస్థలం వంటి సినిమాల్తో క్యూట్ బ్యూటీ సమంత మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు మంచి మనసున్న వ్యక్తి అని పలు సందర్భాల్లో నిరూపించుకుంది. ప్రత్యూష ఫౌండేషన్‌ సంస్థకి అండగా నిలిచి గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు ఆపరేషన్ చేయించింది. చైన్నై వరద భాదితులకు సాయం చేసింది. తాజాగా మరో సాయం చేసి బ్యూటీ విత్ హార్ట్ అని అభినందనలు అందుకుంటోంది. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తోంది. “ఈ ఏడాది మా కుటుంబం వంద మంది పాఠశాల బాలలకు ఏడాది పాటు మధ్యాహ్న భోజ‌నం అందిస్తోంది. ఏడాదికి కేవ‌లం 950 రూపాయ‌లు విరాళంగా ఇస్తే ఏడాది పాటు ఒక విద్యార్థికి రుచిక‌ర‌మైన, పౌష్టికాహార భోజ‌నం అందించవచ్చు.

అక్ష‌య పాత్ర ఆర్గనైజేషన్‌ ద్వారా సాయం చేయండి” అని కోరింది. https://www.akshayapatra.org/isharemylunch వెబ్‌సైట్‌ ద్వారా సాయం చేయమని సూచించింది. దీంతో అభిమానులు, నెటిజనులు సమంతని అభినందిస్తున్నారు. తాము కూడా సాయం చేస్తామని అనేకమంది ముందుకు వస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సమంత “యూ టర్న్” సినిమాని తెలుగు, తమిళ భాషల్లో చేస్తోంది. అలాగే డైరక్టర్ త్యాగరాజన్‌ దర్శకత్వంలో “సూపర్‌ డీలక్స్‌”, శివ కార్తికేయన్ తో సీమ రాజా అనే మూవీలో నటిస్తోంది. చైతూని పెళ్లి చేసుకున్న తర్వాత సమంత మరింత బిజీ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus