Samantha: సెల్ఫీ పోస్ట్ తో వాళ్ల నోర్లు మూయించిన సమంత.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత (Samantha) కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటుండగా ఈ మధ్య కాలంలో సమంత పర్సనల్ లైఫ్ ను టార్గెట్ చేస్తూ కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇష్టానుసారం వార్తలు ప్రచారం చేసేవాళ్లకు బుద్ధి వచ్చేలా తాజాగా సమంత వ్యవహరించడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. స్టైలిష్ లుక్ లో ఉన్న సెల్ఫీని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Samantha

“శాంతి, నిశ్శబ్దాల మ్యూజియం” అని సమంత (Samantha) టీ షర్ట్ పై రాసి ఉండగా ఆ కొటేషన్ ఫోటో ఉన్న పోస్ట్ కు నవ్ వీ ఆర్ ఫ్రీ అనే ఇంగ్లీష్ పాటను ఆమె జత చేశారు. దీని గురించి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. సమంత షేర్ చేసిన కొటేషన్ కొంతమందికి సరైన సమాధానమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తన గురించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్న నేపథ్యంలో సైలెంట్ గా ప్రశాంతంగా శాంతంతో ఉండటమే మంచిదని సామ్ అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు సమంత (Samantha) బృంద సినిమా గురించి రియాక్ట్ అవుతూ త్రిష (Trisha) తన పాత్రలో అద్భుతంగా నటించిందని చెప్పుకొచ్చారు. టీమ్ అందరికీ శుభాకాంక్షలు అని సామ్ పేర్కొన్నారు. ఆ పోస్ట్ కు త్రిష స్పందిస్తూ “థాంక్యూ సామ్ డార్లింగ్” అని కామెంట్ చేశారు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన సోనీ లివ్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండటం గమనార్హం.

సమంత మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సమంత రెమ్యునరేషన్ భారీ స్థాయిలో ఉండగా సమంత వేగంగా సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత సిటాడెల్ వెబ్ సిరీస్ తో సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు. సమంత లుక్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. సమంత సరికొత్త కథలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తప్పొప్పుకోవడం కంటే తప్పించుకోవడం సులభమా శంకరా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus