Samantha: నువ్వంటే ఇష్టమని విజయ్ దేవరకొండకు చెప్పేస్తాను: సమంత

  • September 5, 2023 / 03:30 PM IST

విజయ్ దేవరకొండ సమంత తాజాగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసింది. ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ విధంగా ఈ సినిమా సక్సెస్ కావడంతో సమంత సోషల్ మీడియా వేదిక తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సమంత అమెరికాలో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సందర్భంగా ఖుషి సినిమా విజయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. తాజాగా ఈ మూవీ అమెరికాలో 1 మిలియన్ డాలర్ క్లబ్ లో అడుగుపెట్టింది.ఈ విషయంపై సమంత ఆనందం వ్యక్తం చేశారు. ఇలా అమెరికాలో ఈ సినిమా వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడంతో సమంత నటించిన సినిమాలలో వన్ మిలియన్ డాలర్ క్లబ్లో చేరిన సినిమాలలో ఇది 17వ సినిమా కావటం విశేషం.

ఇలా ఈ సినిమాను ఎంతో మంచిగా ఆదరించినటువంటి అమెరికా ప్రేక్షకులకు ఈమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.. ఇక తన సినీ కెరియర్ కూడా అమెరికాలోనే స్టార్ట్ అయిందని తెలియజేశారు. ఖుషి సినిమాలో భాగంగా ఇక్కడ ప్రేక్షకులను కలవడం చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు. ఈ విషయాన్ని తాను నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఇలా నా విజయానికి కారణమైనటువంటి అమెరికా ప్రేక్షకులను కలుసుకోవడానికి నాకు 13 సంవత్సరాల సమయం పట్టిందని తెలిపారు.

గత నెల రోజులుగా అమెరికాలోని ప్రేక్షకులు నాపై చూపిస్తున్నటువంటి ఈ ప్రేమను తప్పకుండా తాను విజయ్ దేవరకొండకు తెలియజేస్తానని తెలిపారు. అదే విధంగా ఇక్కడి ప్రేక్షకులకు ఆయన అంటే ఎంత అభిమానం అనేది విజయ్ దేవరకొండకు తెలుసని ఈ సందర్భంగా సమంత (Samantha) సంతోషం వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఖుషి సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!
బిగ్ బాస్ సీజన్ – 7 ఎలా ఉండబోతోందో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus