నిజంగా సమంత.. ఆమె బయోపిక్ లో నటిస్తుందా?

సమంత ప్రస్తుతం ’96’ రీమేక్ లో నటిస్తుంది. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రేమ్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిమిస్తున్నాడు. ఇదిలా ఉండగా… తన ఫ్యామిలీతో ప్రస్తుతం విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది సమంత. అయితే ఈమె ఓ బయోపిక్ లో నటించడానికి రెడీ అయ్యిందని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు … ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆమె బయోపిక్ ను రూపొందించాలని నటుడు సోనూసూద్‌ నిర్ణయించుకున్నాడట. పివి సింది పాత్ర కోసం సమంతను సంప్రదించాడట.మొదట సోనూసూద్ ఈ చిత్రాన్ని బాలీవుడ్ హీరోయిన్‌తో తెర‌కెక్కించాల‌నుకున్నాడట‌. కానీ బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకుని స‌మంత అయితేనే కరెక్ట్ అని డిసైడ్ అయ్యాడట. ప్ర‌స్తుతం కథా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయని తెలుస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే సమంత కు సన్నిహిత వర్గాలు మాత్రం అలాంటి ప్రపోజల్ ఏదీ ఇప్పటి వరకూ రాలేదని చెప్పుకొస్తున్నారు.’పివి సింథు పాత్ర చేయాలంటే ఫిజికల్ గా బాగా స్ట్రెంత్ ఉండాలి. వచ్చే సంవత్సరం తల్లి కావాలని సమంత ప్లాన్ లో ఉందట. ఇలాంటి టైమ్ లో ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్ లు చేసే అవకాశం లేదని’ వారు చెప్పుకొస్తున్నారు. అయినా పీవీ సింధు బాగా హైట్.. ఆమె పాత్రకి సమంత ఎలా సెట్ అవుతుంది అని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus