సమంత ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఇదివరకే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్న సమంత పలు విషయాలను వెల్లడించారు. శాకుంతలం సినిమా పూర్తి కథ వినగానే నేను ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యానని తెలిపారు.
భారతీయ సాహిత్యంలో ఎందరో ప్రేమించే శకుంతల పాత్రను నేను పోషించడం చాలా పెద్ద బాధ్యతగా అనిపించింది. అయితే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో రాజీ లాంటి పాత్రలో నటించిన తర్వాత నేను శకుంతల పాత్రలో నటించగలనా అనే భయం తనని వెంటాడిందని అందుకే ముందుగా ఈ సినిమాకి నో అని చెప్పానని సమంత తెలిపారు. శకుంతల అంటే కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదని హుందాతనం ఆత్మగౌరవం కలిగిన యువతి.
ఏ తరం వారికైనా శకుంతల పాత్ర ఇలాగే కనెక్ట్ అవుతుందని ఆలోచించి ఈ సినిమాకు కమిట్ అయ్యానని (Samantha) తెలిపారు.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని సమంత తెలిపారు. అయితే ఆ ఇబ్బందుల కారణంగా నా జీవితం నాశనం కాకూడదన్న కారణంతో తనని తాను స్ట్రాంగ్ చేసుకున్నానని తెలిపారు.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను ఇబ్బందుల కారణంగా షూటింగ్ కు రా లేకపోతే నన్ను షూటింగ్ కు రమ్మని ఒక్కరు కూడా తనకు ఫోన్ చేయలేదని, ఇలా తనకు ఇండస్ట్రీ నుంచి ఎంతో మంచి సపోర్ట్ లభించింది అంటూ ఈ సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా ఎంతో అద్భుతమైన ప్రేమ కథ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శాకుంతలం సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది.