ఓ బేబీతో బాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్న సామ్

  • July 13, 2019 / 06:47 PM IST

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా విశేషమైన ఇమేజ్ సంపాదించుకొన్నప్పటికీ.. సమంతకు ఎందుకనో బాలీవుడ్ కి మాత్రం వెళ్లలేకపోయాననే బాధ మనసులో ఉండిపోయినట్లుంది. తన గురువు గౌతమ్ మీనన్ కోసం “ఏ మాయ చేసావే” చిత్రానికి హిందీ రీమేక్ గా రూపొందిన “ఏక్ దీవానా తా”లో అతిధి పాత్ర పోషించినప్పటికీ.. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో సరైన గుర్తింపు లభించలేదు. ఇప్పుడు ఆ కొరతను “ఓ బేబీ” సినిమా ద్వారా తీర్చుకోవాలనుకొంటుంది సమంత.

ఆల్రెడీ “ఓ బేబీ” చిత్రాన్ని తమిళంలో రీమేక్ లేదా డబ్బింగ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతుండగా.. ఇప్పుడు అదే ఊపులో బాలీవుడ్ లోనూ ఈ చిత్రాన్ని సమంతతో రీమేక్ చేసేందుకు యుద్ధప్రాతిపదికన సమాయత్తమవుతున్నారు సురేష్ బాబు. ఆల్రెడీ హిందీలో పలు చిత్రాలు నిర్మించిన అనుభవం ఉన్న సురేష్ బాబు “ఓ బేబీ”ని సమంతతోనే హిందీలో కూడా రీమేక్ చేయనున్నారట. హిందీ వెర్షన్ కి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అసలు ఈ ప్రొజెక్ట్ ఎప్పటికీ సెట్స్ కి వెళుతుంది అనేది తెలియాలంటే కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus