సమంత (Samantha) కొన్నాళ్ల నుండి ‘ది ఫ్యామిలీ మెన్'(వెబ్ సిరీస్) దర్శకుడు రాజ్ తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నాగ చైతన్య (Naga Chaitanya) .. శోభితని (Sobhita Dhulipala) రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుండి.. సమంత రెండో పెళ్లి గురించి కూడా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రాజ్ తో సమంత చాలా సన్నిహితంగా ఉంటుంది. ఆమె సొంత బ్యానర్ ‘ట్రాలాల మూవింగ్ పిక్చర్స్’ లో రూపొందిన ‘శుభం’ కి (Subham) ఫండింగ్ కూడా రాజ్ ఇచ్చినట్టు చాలా ప్రచారం జరిగింది.
ఆ సినిమాకు పనిచేసిన వాళ్లలో చాలా మంది రాజ్ తో సత్సంబంధాలు మెయింటైన్ చేసినట్టు కూడా గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ బుక్కయినట్టు టాక్ నడుస్తుంది. విషయం ఏంటంటే.. సమంత తాజాగా ఒక పోస్ట్ పెట్టింది. ఆమె కళ్ళజోడు పెట్టుకున్న ఓ ఫోటోని సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోని కరెక్ట్ గా గమనిస్తే.. సమంత కళ్లజోడు ఓ మగ వ్యక్తి నీడ కనిపిస్తుందట.
అది సమంత రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ అయిన రాజ్ నీడ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది సమంత పరోక్షంగా… తన రిలేషన్ షిప్ గురించి హింట్ ఇస్తూ వస్తోందని అభిప్రాయపడుతున్నారు. మొన్నామధ్య శ్రీకాళహస్తిలో కూడా సమంత పూజలు నిర్వహించింది. రాజ్ తో పెళ్లి కోసమే ఆమె పూజలు నిర్వహించినట్టు ప్రచారం గట్టిగానే జరిగింది. ఇప్పుడు మరోసారి తన ప్రియుడితో కలిసి దొరికేసింది అంటూ మళ్ళీ వార్తల్లో నిలిచింది.