Samantha: బర్త్ డే సందర్భంగా సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.!

సమంత ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. వరుస హీట్ లతో స్టార్ హీరోయిన్స్ సరసన చేరింది. తరువాత హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. సంవత్సరం క్రితం వారు అధికారంగా విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే..నాగచైతన్యతో విడిపోయిన తరువాత తోలిసారి బర్త్ డే చేసుకున్న సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసింది.. సమంత పోస్ట్ ఏమి చేసిందో చూద్దాం.. ఏప్రిల్ 28న సమంత తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ ఏడాది ఈ అమ్మడు 36వ పుట్టినరోజుని స్నేహితుల మధ్య ఘనంగా జరుపుకుంది.

తాజాగా తన బర్తే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. సమంత బర్త్ డే సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్, సౌత్ స్టార్స్ అంతా కూడా బెస్ట్ విషెస్ తెలియజేశారు. తాజాగా తన బర్త్ డే వేడుకులకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంచుకున్న సమంత ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ” పుట్టిన రోజున సింపుల్ రూల్స్..

సర్ ప్రైజ్లు కాదు, కేక్లు కాదు.. బెలూన్లు కూడా కాదు.. నేను కోరుకున్నది నాకు స్పష్టంగా లభించింది.’ అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. సమంత ఇలాంటి క్యాప్షన్ ఎందుకు పెట్టిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఇదిలా ఉండగా ఇటీవల శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సమంత ఈ సినిమాతో సక్సెస్ అందుకోలేకపోయింది. సమంత కెరీర్లోనే శాకుంతలం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది.

ఇటీవల ‘సిటాడెల్’ ప్రమోషన్స్ లో కూడా సమంత (Samantha) సందడి చేసింది. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’లో నటిస్తూ బిజీగా ఉంది. ఇంతకాలం సమంత అనారోగ్యం వల్ల వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం మళ్లీ పట్టాలెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సెప్టెంబర్ 1 వ తేదీన ఐదు భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాతో అయినా సమంత, విజయ్ దేవరకొండకి హిట్ పడుతుందో? లేదో? చూడాలి మరి.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus