Samantha: ‘యశోద’ సినిమా సెట్ లో సమంత

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. నటిగానే కాకుండా.. ఆమెకి కొన్ని వ్యాపారాలు కూడా ఉండడంతో అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ బిజీ అయిపోయింది. తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకున్న అనంతరం సమంతలో చాలా మార్పులు వచ్చినట్లు కనిపిస్తోంది. సమంత చేస్తోన్న విహార యాత్రలు, ఎడ్వెంచర్లు, ఆమె చేస్తోన్న సినిమాలు ఇలా అన్నీ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు సమంత ‘యశోద’ అనే సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.

Click Here To Watch NOW

ఈ సినిమా కోసం టీమ్ మొత్తం నార్త్ ఇండియాకు మకాం మార్చినట్లు కనిపిస్తోంది. నిన్న సమంత ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. తన స్టయిలిష్ట్ ప్రీతమ్ జుట్టుని సమంత కట్ చేసింది. దానికి ప్రీతమ్ డబ్బు చెల్లించలేదంటూ సమంత సరదాగా కామెంట్ చేసింది. దానికి ప్రీతమ్ నన్ను చంపేయ్ అంటూ బదులిచ్చాడు. తాజాగా సమంత మరో పోస్ట్ పెట్టింది. ‘యశోద’ సెట్ లో సమంత ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లుంది.

సెట్ లో ఉన్న ప్రాపర్టీ, ఫుడ్ ను దొంగిలించే ప్రయత్నం చేసింది. ఫుడ్ తినాలని సమంత ప్రయత్నించినట్లుంది. కానీ ఇంతలోనే ఆ ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ మేరకు సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో షేర్ చేసింది. సెట్ ప్రాపర్టీ.. దొంగతనం చేయడానికి వీల్లేదు.. మరీ ముఖ్యంగా తినే పదార్థాలను అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియోలో సమంత నవ్వుతూ కనిపించింది. మొత్తానికి సమంత ఓ పక్క సినిమాలు, మరో పక్క యాడ్స్, బిజినెస్ అంటూ ఫుల్ బిజీగా ఉంటోంది.

తెలుగుతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లలో కూడా సినిమాలు ఒప్పుకుంటోంది. తాజాగా ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆమె లైనప్ చూస్తుంటే మరో రెండు, మూడేళ్ల వారకు ఆమె నుంచి వరుస సినిమాలు రావడం ఖాయమనిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus