ఓ పక్క సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ ఊహాగానాలు వస్తుంటే.. మరోపక్క వాటికి ఊతమిచ్చేలా సమంత పోస్ట్ లు పెడుతోంది. తాజాగా సమంత మరో కొటేషన్ షేర్ చేసింది. నిజానికి అందులో తప్పేం కనిపించడం లేదు కానీ.. సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని ఆ కొటేషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేసిందని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ కొటేషన్ ఏంటంటే.. ”నీ చుట్టూ ఉండేవాళ్లపై నువ్వు ఎంత ప్రభావం చూపిస్తున్నావో నిజంగా నీకు తెలియదు.
నువ్విచ్చే ఒక చిన్న చిరునవ్వు ఎదుటి వ్యక్తికి ఎంత అవసరమో నీకు తెలియదు. నువ్వు చూపించే దయ, మరో వ్యక్తి జీవితం మొత్తాన్ని ఎంతలా మార్చేస్తుందో నీకు తెలీదు” ఇది సమంత పెట్టిన పోస్ట్. ఇలాంటివి సమంత గతంలో చాలానే పెట్టింది. కానీ ఈ పోస్ట్ ను మాత్రం నెటిజన్లు ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వాళ్లు అర్ధం చేసుకుంటున్నారు. తమకు తోచినట్లైగా కథలు అల్లేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా వస్తోన్న ఈ పుకార్లపై సమంత-నాగచైతన్య ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.
ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సమంత ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసింది. ఇక చైతు నటించిన ‘లవ్ స్టోరీ’ విడుదలకు సిద్ధమవుతోంది. అలానే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ అనే సినిమాలో నటిస్తున్నాడు చైతు.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!