NBK 111 : బాలయ్యను ఢీ కొట్టబోతున్న కటారి కృష్ణ.. విషయం ఏంటంటే?

నందమూరి బాలకృష్ణ మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న NBK111 సినిమాపై టాలీవుడ్‌లో మంచి హైప్ నెలకొంది. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా, యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపి సినిమా సిద్ధమవుతోందని సమాచారం. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.

NBK 111

ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నయనతార నటిస్తుండటం విశేషం. అయితే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం విలన్ పాత్ర. ఈసారి బాలయ్యకు ప్రతినాయకుడిగా నటుడు సముద్రఖని రంగంలోకి దిగుతున్నారని తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడిస్తూ, తన పాత్ర చాలా శక్తివంతంగా, కథలో కీలకంగా ఉంటుందని చెప్పారు.

గతంలో “క్రాక్” సినిమాలో కఠారి కృష్ణగా సముద్రఖని చూపించిన విలనిజం ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే NBK111లో తన పాత్ర దానికంటే మరింత తీవ్రంగా, ఇంటెన్స్ గా ఉండబోతుందని ఆయన స్వయంగా చెప్పడం ఆసక్తిని పెంచుతోంది. దీంతో బాలయ్య-సముద్రఖని మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలైట్ అవుతాయని అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రం ముంబై నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతోందని సమాచారం. థమన్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి 2027కు ఈ సినిమాను విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది. బాలయ్య మాస్ ఇమేజ్, గోపీచంద్ మలినేని స్టైల్, సముద్రఖని పవర్‌ఫుల్ విలనిజం..ఇలా పవర్ ప్యాక్డ్ గా రూపొందుతున్న NBK111 ఒక భారీ హిట్ అవుతుంది అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.

Vicky Kaushal : వివాహ బంధాన్ని తక్కువ చేస్తూ విక్కీ కౌశల్ వ్యాఖ్యలు.. ఈ పద్ధతి సరికాదు అంటున్న నెటిజన్లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus