Samuthirakani: వైరల్ అవుతున్న సముద్రఖని షాకింగ్ కామెంట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తన చుట్టూ ఉన్నవాళ్లకు ఏ కష్టం రాకుండా పవన్ కళ్యాణ్ కంటికి రెప్పలా కాపాడుకుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. కష్టాల్లో ఉన్న ఎంతోమందికి తన వంతు సహాయం చేసిన పవన్ కళ్యాణ్ ఆ సహాయాలను చెప్పుకోవడానికి అస్సలు ఇష్టపడరు. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో వినోదాయ సిత్తం రీమేక్ తెరకెక్కుతుండగా ఈ సినిమా జులై నెల 28వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

వినోదాయ సిత్తం రీమేక్ కు సముద్రఖని దర్శకుడు అనే సంగతి తెలిసిందే. తాజాగా సముద్రఖని పుట్టినరోజు జరుపుకోగా సముద్రఖని పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక లేఖను విడుదల చేశారు. సముద్రఖనికి పవన్ హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మా బంగారు గని శ్రీ సముద్రఖని అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సముద్రఖని మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని పవన్ ఆకాంక్షించారు.

ఆ లెటర్ గురించి సముద్రఖని (Samuthirakani) స్పందిస్తూ అన్నయ్యా.. మీరు నాపై చూపించే ప్రేమాభిమానులకు కృతజ్ఞుడినని పేర్కొన్నారు. మీతో నటుడిగా, దర్శకుడిగా ఈ ప్రయాణంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నానని సముద్రఖని చెప్పుకొచ్చారు. సమాజంలో విషయంలో మీకున్న ప్రేమ నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానిని అయ్యేలా చేసిందని ఆయన కామెంట్లు చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి సాహసయోధుడి ఆలోచనలకు, దృక్పథానికి సహచరుడినై ఉండాలని కోరుకుంటున్నానని సముద్రఖని చెప్పుకొచ్చారు.

భారతదేశానికి మేలు జరిగేలా ఆ భగవంతుడు పవన్ ను నడిపించాలని పవన్ కు ఆ శక్తి ప్రసాదించాలని కోరుకుంటున్నానని సముద్రఖని కామెంట్లు చేశారు. సముద్రఖని వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. వినోదాయ సిత్తం రీమేక్ తో పవన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ సముద్రఖని కాంబోలో రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus