కబీర్ సింగ్ హిట్ అయితే బాలీవుడ్లో, ఫ్లాపైతే టాలీవుడ్లో

“అర్జున్ రెడ్డి” విడుదలై సంచలన విజయం సొంతం చేసుకొన్నప్పుడు.. ఆ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తదుపరి సినిమా అంటూ పలు ప్రోజెక్ట్స్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అందులో మహేష్ బాబు హీరోగా ప్లాన్ చేసిన సినిమా ఒకటి. ఆ సినిమాకి “షుగర్ ఫ్యాక్టరీ” అనే వర్కింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఆ సినిమా ఎప్పుడు సెట్స్ కు వెళ్తుంది అనే విషయంలో ఇప్పటివరకూ క్లారిటీ లేకుండాపోయింది. అయితే.. నిన్నమొన్నటివరకూ కథానాయకుడు మహేష్ బాబు కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కానీ రెస్పాండ్ అవ్వకపోవడంతో ఈ ప్రొజెక్ట్ కూడా రూమర్స్ వరకే పరిమితం అనుకున్నారు అందరూ.

కానీ మహేష్ బాబు అనిల్ రావిపూడితో సినిమా అనంతరం మళ్ళీ వంశీ పైడిపల్లితోనే మరో సినిమా చేయనున్నాడనే వార్తలు వస్తుండడంతో.. సందీప్ రెడ్డితో మరో రెండేళ్ల వరకూ మరో సినిమా లేనట్లేనని అందరికీ క్లారిటీ వచ్చేసింది. దాంతో సందీప్ రెడ్డి ఇప్పుడు సీరియస్ గా “కబీర్ సింగ్” రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సినిమా రిజల్ట్ బట్టి నెక్స్ట్ సినిమా బాలీవుడ్ లో ఉంటుందో లేక తెలుగులో ఉంటుందా అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. సో జూన్ 21న సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఏ భాషలో ఉండబోతోంది అనేది తెలుస్తుంది .

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus