క్రిటిక్స్ ను భయపెట్టడానికే సినిమా తీస్తున్న సందీప్ వంగా

ఇప్పటివరకూ హిట్ కొట్టడం కోసం సినిమాలు తీసినవాళ్లను చూశాం, లేదా డబ్బు సంపాదించడం కోసం తీసినవాళ్లను చూశాం. కానీ.. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాత్రం ముచ్చటగా మూడో రకంగా సినిమా తీయడానికి సన్నద్ధమవుతున్నాడు. ఆ మూడో టైప్ ఏమిటనుకొంటున్నారా? బాలీవుడ్ లో “కబీర్ సింగ్” నచ్చలేదని చెప్పి ఊరుకోకుండా ఆ సినిమా వల్ల సమాజానికి చేటు అని, అదొక చెత్త సినిమా అని తెగ రచ్చ చేసిన క్రిటిక్స్ ను భయపెట్టడానికి మాత్రమే ఒక సినిమా తీస్తున్నాడట సందీప్ రెడ్డి వంగా.

నిజానికి సందీప్ కి తెలుగులో మహేష్ బాబు మరియు హిందీలో సల్మాన్ ఖాన్ లు సినిమాలు ఒకే చేశారు. కానీ.. ఈ ఇద్దరితో సినిమా చేయడానికంటే ముందు ఒక బ్లడీ థ్రిల్లర్ ను తెరకెక్కించనున్నాడట సందీప్ రెడ్డి వంగా. హింస, క్రుయాలిటీ, రక్తం వంటి పదాలకు సరికొత్త నిర్వచనం ఈ సినిమాతో చెబుతానని అంటున్నాడు సందీప్ రెడ్డి వంగా. కబీర్ సింగ్ లో చూపించిన చిన్న చిన్న బోల్డ్ సీన్స్ కే మొత్తుకున్న బాలీవుడ్ క్రిటిక్స్ బ్యాచ్ సందీప్ కక్ష సాధించి చర్యగా తెరకెక్కించనున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ చూసి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus