బాలీవుడ్‌కి అర్జెంట్‌గా ఓ బ్లాక్‌బస్టర్ హిట్ కావాలి, లేదంటే ఇండస్ట్రీలో సరైన విజయం అందుకున్న సినిమా లేదు అని అందరూ నవ్వుకుంటారు అని అనుకుంటున్న సమయంలో వచ్చిన సినిమా ‘యానిమల్’ (Animal). రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) – రష్మిక మందన (Rashmika Mandanna) – త్రిప్తి డిమ్రి (Tripti Dimri) కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. అదేంటి దర్శకుడు పేరు రాయలేదు. ఆయనే కదా సినిమాను ఆ లెవల్‌లో తీసింది అనుకుంటున్నారా? అవును ఆయన మాట కూడా ఇదే.
సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా భారీ విజయంతోపాటు భారీ వసూళ్లు కూడా అందుకుంది. అయితే అదే స్థాయిలో ఈ సినిమాపై కొందరు సినీ ప్రముఖులు విమర్శలు కురిపించారు. నిజానికి కురిపించారు అనే కంటే ఎత్తి పోశారు అని అంటే బాగుంటుంది. బాలీవుడ్‌లో అలాంటి సినిమాలు ఇప్పటివరకు రానట్లు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను ఏవేవో మాటలు అన్నారు. అయితే ఆ సినిమా చేసిన రణ్‌బీర్‌ను మాత్రం ఏమీ అనలేదు.
సినిమాలో తీవ్ర హింస, కొన్ని సన్నివేశాల్లో స్త్రీలను తక్కువ చేసి చూపించడంపై ఆ సీనియర్ రచయితలు, నటులు, దర్శకులు అసహనం వ్యక్తంచేశారు. తాజాగా ఈ విషయమై సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఆ సినిమా తీసిన తనను అంటున్నారు కానీ, చేసిన హీరోను విమర్శించలేదు అని చెప్పారు. అలాగే సినిమా విజయాన్ని హీరోకు మాత్రమే ఆపాదిస్తున్నారు తప్ప.. దర్శకుడికి ఆ ఆనందం, గౌరవం ఇవ్వడం లేదు అని కూడా కామెంట్ చేశారాయన.
యానిమల్’ సినిమాను విమర్శించినవారు.. ఆ సినిమా చేసిన రణ్‌బీర్‌ను తెలివైన వ్యక్తి అన్నారు కానీ విమర్శించలేదు. రణ్‌బీర్ తెలివైన వ్యక్తే.. మరి రచయిత, దర్శకుడి పరిస్థితేంటి? విమర్శిచంఇన వారంతా రణ్‌బీర్‌తో ఓ సినిమా చేద్దామనుకుంటున్నారు. నేను పరిశ్రమకు కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను విమర్శించడం సులభం అని లాజిక్ పాయింట్ మాట్లాడారు సందీప్ వంగా. చూద్దాం ఆయన మాటలకు ‘ఆ మాజీలు’ ఏమన్నా రియాక్ట్ అవుతారేమో.