జైలు జీవితం తరువాత మళ్ళీ సినిమాల్లోకి

  • January 5, 2021 / 12:05 PM IST

టాలీవుడ్ లో బుజ్జిగాడు హీరోయిన్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సంజన గల్రానీ. ఈ హీరోయిన్ గత కొన్ని నెలల క్రితం డ్రగ్స్ కేసులో అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు కన్నడ ఇండస్టీకి చెందిన మరొక హీరోయిన్ కూడా అరెస్ట్ అవ్వడం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 13న జైలు నుంచి బెయిల్ పై విడుదలైన అనంతరం సంజన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

ఇక వీలైనంత త్వరగా ఆమె మళ్ళీ తన సినిమాతో బిజీ కావాలని అనుకంటోంది. లాక్ డౌన్ కంటే ముందే రెండు మూడు సినిమాలు చేయడానికి ఒప్పుకున్న సంజన డ్రగ్స్ కేసులోకి రాగానే ఆ ఆఫర్స్ నుంచి నిర్మాతలు తప్పించారట. ఇక సినిమా ఇండస్ట్రీలో సంజనకు ఆఫర్స్ రావని అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఆమె తమిళ్, కన్నడ లోనే ఆఫర్స్ ఎక్కువగా అందుకుంటోందట. వీలైనంత వరకు ఒక మంచి సినిమాతో హిట్ కొట్టాలని టార్గెట్ సెట్ చేసుకుందట.

మరి ఆ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇక ఇటీవల ఒక బెంగాలీ హీరోయిన్ కూడా డ్రగ్స్ సరఫరా కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus